దేశంలో ప్రముఖ ప్రైవేట్ బ్యాంకింగ్ రంగ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు తమ ఖాతాదారులకు కీలక అలర్ట్ మెసేజ్ జారీ చేసింది. రెండు రోజుల పాటు కొన్ని సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుందని కస్టమర్లకు మెసేజ్ ల ద్వారా తెలియజేస్తోంది. ఆగస్టు 22, 23 తేదీల్లో వాట్సాప్ ద్వారా చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉండవని HDFC Bank తెలిపింది. ఈ సమయంలో బ్యాంక్ కస్టమర్ కేర్ సేవలకు కూడా అంతరాయం కలగనుందని అధికారిక ప్రకటనలో తెలిపింది.
బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంకింగ్ అనుభవాన్ని మరింతగా మెరుగుపరచడం కోసం వ్యవస్థల నిర్వహణను చేపడుతున్నామని అందువల్ల ఈ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్ పేర్కొంది.హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ తెలిపిన వివరాల ప్రకారం.. మీ బ్యాంకింగ్ అనుభవాన్ని మరింత తేలికగా, ఫాస్ట్ గా మెరుగుపరచి సేవలను అందించడానికి ఆగస్టు 22 రాత్రి 11:00 గంటల నుండి ఆగస్టు 23 ఉదయం 6:00 గంటల వరకు అవసరమైన సిస్టమ్ మెయింటెనెన్స్ నిర్వహిస్తున్నామని నోటీసులో తెలిపింది.

దీంతో కొన్ని బ్యాంకింగ్ సేవలు ఏడు గంటల పాటు అందుబాటులో ఉండవని ఖాతాదారులు గమనించాలని కోరింది. ఈ రెండు రోజుల కాలంలో కస్టమర్ కేర్ సేవలు (ఫోన్ బ్యాంకింగ్ ఐవీఆర్, ఈమెయిల్ & సోషల్ మీడియా), వాట్సాప్‌లో చాట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ బ్యాంకింగ్ సేవలు కస్టమర్లకు అందుబాటులో ఉండవని బ్యాంక్ వెల్లడించింది.ఇక మెయింటెనెన్స్ పీరియడ్ లో ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, పేజాప్, మై కార్డ్స్ సేవలు మాత్రం యథావిధిగా అందుబాటులో ఉంటాయని ఈ ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం వివరించింది.
HDFC బ్యాంక్ కొన్ని సేవలు అందుబాటులో లేకపోయినా, కస్టమర్లు ఈ కాలంలో కూడా లావాదేవీలను కింది మార్గాల ద్వారా కొనసాగించవచ్చు
1. ఫోన్ బ్యాంకింగ్ ఏజెంట్ సేవలు
2. HDFC బ్యాంక్ నెట్ బ్యాంకింగ్
3. HDFC మొబైల్ బ్యాంకింగ్ యాప్
4. PayZapp (HDFC నెట్ బ్యాంకింగ్ ద్వారా)
HDFC నెట్ బ్యాంకింగ్ ద్వారా 200 కంటే ఎక్కువ రకాల లావాదేవీలు ఎప్పుడైనా, ఎక్కడి నుండైనా చేయవచ్చు.
ప్రతి HDFC బ్యాంక్ కస్టమర్‌కి ఆటోమేటిక్‌గా నెట్ బ్యాంకింగ్ ఖాతా సృష్టించబడుతుంది.
మీరు ఇంకా రిజిస్టర్ చేయకపోతే, ఆన్‌లైన్ లేదా ATM ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు
HDFC బ్యాంక్ నెట్ బ్యాంకింగ్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు (Step by Step)
కస్టమర్ ID ని నమోదు చేయండి
రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్‌ను వెరిఫై చేయండి
మొబైల్‌లో వచ్చిన OTP (One Time Password) ఎంటర్ చేయండి
మీ డెబిట్ కార్డ్ వివరాలను ఎంచుకొని ఎంటర్ చేయండి
కొత్త IPIN (Internet Password) సెట్ చేయండి
మీరు సెట్ చేసిన IPIN తో Net Banking లో Login అవ్వండి
HDFC ATM ద్వారా నెట్ బ్యాంకింగ్ కోసం నమోదు
మీ సమీపంలోని HDFC బ్యాంక్ ATM ని సందర్శించండి
HDFC బ్యాంక్ డెబిట్ కార్డ్ నంబర్ మరియు ATM PIN ఎంటర్ చేయండి
ప్రధాన స్క్రీన్ నుండి Other Options ఎంచుకోండి
NetBanking Registration ఎంచుకొని, Confirm పై క్లిక్ చేయండి
మీ NetBanking కోసం IPIN కొరియర్ ద్వారా పంపబడుతుంది
More From GoodReturns

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?



Click it and Unblock the Notifications