For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Bank strike: నేటి నుండి మూడ్రోజులు బ్యాంకులు క్లోజ్

|

ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి యాజమాన్యాలతో ప్రభుత్వరంగ బ్యాంకులు జరిపిన చర్చలు విఫలం కావడంతో జనవరి 31, ఫిబ్రవరి 1 తేదీల్లో సమ్మె నిర్వహించాలని బ్యాంకింగ్ యూనియన్లు నిర్ణయించాయి. దీంతో బ్యాంకింగ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఫిబ్రవరి 2వ తేదీ ఆధివారం కావడంతో బ్యాంకులు మళ్లీ సోమవారమే తెరుచుకుంటాయి. మొత్తం మూడ్రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు నిలిచిపోతున్నాయి. మనీ డిపాజిట్, ఉపసంహరణ, చెక్ డిపాజిట్ వంటి సేవలు ఉండవు. మూడ్రోజుల సెలవు నేపథ్యంలో ఏటీఎంలలో డబ్బులు లేక ఇబ్బందులు తలెత్తవచ్చు.

బ్యాంకు సేవలకు అంతరాయం, ఏటీఎంలూ ఇబ్బంది పెట్టవచ్చుబ్యాంకు సేవలకు అంతరాయం, ఏటీఎంలూ ఇబ్బంది పెట్టవచ్చు

ప్రభుత్వ, ప్రయివేటు రంగంలో దాదాపు 10 లక్షల మంది ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొంటున్నారని అఖిల భారత బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. దీంతో జనవరి 31-ఫిబ్రవరి 1 తేదీల్లో వివిధ బ్యాంకు సేవలు ప్రభావితమవుతాయి. బ్యాంకింగ్ రంగంలో తొమ్మిది యూనియన్లతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు నాయకత్వం వహిస్తోంది.

Bank strike: Two day strike hit operation of PSU banks

సమ్మెకాలంలో 80 వేల బ్యాంకు శాఖల్లో ఎక్కువ భాగం మూతబడతాయని చెప్పారు. అలాగే మార్చ్ 11 నుండి మూడు రోజుల పాటు మరోసారి సమ్మెను చేపట్టనున్నట్లు కూడా చెబుతున్నారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఏప్రిల్ 1 నుండి నిరవధిక సమ్మె జరుగుతుందని ఇదివరకే ప్రకటించారు.
జనవరి 31 న ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టనున్నారు. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడం గమనార‍‍్హం.

English summary

Bank strike: నేటి నుండి మూడ్రోజులు బ్యాంకులు క్లోజ్ | Bank strike: Two day strike hit operation of PSU banks

Bank unions have decided to go on a two day nationwide strike from Friday as talks with management of public sector lenders on wage revision have failed to reach a consensus.
Story first published: Friday, January 31, 2020, 9:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X