మార్చి నెలలో బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. దీనికి తోడు రేపటి నుండి వరుసగా రెండు రోజుల పాటు సెలవులు, ఆ తర్వాత మరో రెండు రోజులు సమ్మె ప్రభావంతో కస్టమర్లు తమ పనుల్ని ప్రణాళికాబద్దంగా చేపట్టాల్సిన పరిస్థితి. మొత్తంగా బ్యాంకులు నాలుగు రోజులు బంద్ ఉంటున్నాయి. బ్యాంకుల బ్రాంచీకి వెళ్లి ఏదైనా పని చేయాలనుకుంటే ఈ రోజు మాత్రమే గడువు ఉంది. రేపటి నుండి మంగళవారం వరకు బ్రాంచీలు తెరిచి ఉండకపోవచ్చు.
రేపు (మార్చి 13) రెండో శనివారం, ఆదివారం (మార్చి 14) సెలవు దినం కావడంతో బ్యాంకులు పని చేయవు. ఆ తర్వాత సోమ, మంగళవారాలు బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ బ్యాంకింగ్ ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునిచ్చాయి. ఆదివారం నాటికి యూనియన్లు సమ్మె ప్రతిపాదనను విరమించుకోని పక్షంలో బ్యాంకుల వరుసగా నాలుగు రోజులు మూసి ఉంటాయి. ఈ నాలుగు రోజుల్లో మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయి.

మార్చి నెలలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకులు మూసి ఉంటున్నాయి. 15, 16 తేదీల్లో సమ్మెతో పాటు నాలుగు ఆదివారాలు, రెండు రెండో శని వారాలు కలిపి పదకొండు రోజుల పాటు బ్యాంకులు క్లోజ్ ఉంటున్నాయి. ఆర్బీఐ ప్రకటించిన హాలిడే క్యాలెండర్ ప్రకారం మార్చిలో 5, 11, 22, 29, 30 తేదీల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. వీటితో పాటు మహా శివరాత్రి, హోలి పర్వదినాలు వచ్చాయి. ఈ రెండు రోజులు బ్యాంకులు పని చేయడంలేదు. ఇప్పటికే శివరాత్రికి నిన్న క్లోజ్ అయింది.


Click it and Unblock the Notifications