ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం గం.9.18 నిమిషాలకు సెన్సెక్స్ 65.19 (0.16%) పాయింట్లు, నిఫ్టీ 16.70 (0.14%) పాయింట్లు నష్టంతో ప్రారంభమైంది. 517 షేర్లు లాభాల్లో, 267 షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించగా, 50 షేర్లలో ఎలాంటి మార్పు లేదు. మధ్యాహ్నం మార్కెట్లు లాభాల్లోకి వచ్చాయి. గం.12.44 సమయానికి సెన్సెక్స్ 145.64 (0.35%) పాయింట్లు లాభపడి 41,532.04 వద్ద, నిఫ్టీ 50.40 (0.41%) పాయింట్లు లాభపడి 12,230.75 వద్ద ట్రేడ్ అయింది.
మధ్యాహ్నం సమయానికి టాప్ 10 గెయినర్స్ జాబితాలో జీఎంఎం పిఫడ్లర్ లిమిటెడ్, యస్ బ్యాంకు, లెమన్ ట్రీ హోటల్స్, ఎస్సెల్ ప్రోప్యాక్ లిమిటెడ్, వెస్ట్ లైఫ్ డెవలప్‌మెంట్స్, జేకే లక్ష్మీ సిమెంట్స్, సెంచరీ టెక్స్ టైల్స్ అండ్ ఇండస్ట్రీస్, సువెన్ లైఫ్ సైన్సెస్, ఎన్ఎల్సీ ఇండియా, మదర్సన్ సుమి సిస్టమ్స్ లిమిటెడ్ ఉన్నాయి.

టాప్ లూజర్స్ జాబితాలో పవర్ గ్రిడ్ కార్పోరేషన్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, సిప్లా, అదానీ పోర్ట్ ఉన్నాయి.
ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ వ్యాఖ్యలతో గురువారం ఒక్కసారిగా జోరందుకున్న ప్రయివేట్ రంగ సంస్థ యస్ బ్యాంక్ కౌంటర్ మరోసారి వెలుగులో దూసుకెళ్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఈ షేరు భారీ లాభాల్లో ఉన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం సమయం వరకు యస్ బ్యాంకు షేరు 6.84 శాతం పెరిగింది.
దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంకు హాజరైన SBI చైర్మన్ రజనీష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. యస్ బ్యాంకుకు మద్దతుగా మాట్లాడారు. దాదాపు 40 బిలియన్ డాలర్ల బ్యాలన్స్‌షీట్ కలిగిన యస్ బ్యాంక్ దేశీ ఫైనాన్షియల్ మార్కెట్లో చెప్పుకోదగ్గ సంస్థ అన్నారు. దీంతో యస్ బ్యాంక్ విఫలం కాకపోవచ్చునన్నారు. బ్యాంకును నిలబెట్టేందుకు కొన్ని పరిష్కారాలు లభించవచ్చునని ఆశాభావం వ్యక్తం చేశారు.


Click it and Unblock the Notifications