Bank Rule Update: ఇండియాలోని బ్యాంకులు ఎప్పటికప్పుడు రూల్స్ అప్ డేట్ చేస్తూ ఉంటాయి. ఈ నెలలో కూడా కొన్ని మార్పులు చేసాయి, వాటి గురించి ప్రతి ఒక్క కస్టమర్ తెలుసుకోవాలి. ఎందుకంటే రూల్స్ మార్పుల గురించి తేలియాకపోవడం వల్ల మీకు ఆర్థికంగా నష్టాన్ని కలిగించవచ్చు. ATM ట్రాన్సక్షన్ లిమిట్ నుండి అకౌంట్ మినిమం బ్యాలెన్స్ వరకు ఈ నెల నుండి కొన్ని కొత్త మార్పులు అమలులోకి వచ్చాయి.
కొత్తగా మినిమమ్ బ్యాలెన్స్ లిమిట్
కొన్ని బ్యాంకులు అకౌంట్లో కనీస బ్యాలెన్స్ సంబంధించి రూల్స్ మార్చాయి. ఎస్‌బీఐ కస్టమర్లు ఇకపై కనీసం రూ.5000 అకౌంట్లో ఉంచుకోవాలి. గతంలో ఈ పరిమితి రూ.3000 ఉండేది. అదేవిధంగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ లిమిట్ రూ.1000 నుండి రూ.3500కి పెంచింది. కెనరా బ్యాంకులో కనీస మొత్తాన్ని రూ.1,000 నుండి రూ.2,500కి పెంచారు. కనీస మొత్తం కంటే తక్కువ బ్యాలెన్స్ ఉన్న కస్టమర్ల నుండి జరిమానా వసూలు చేస్తారు.

ఏటీఎం ట్రాన్సక్షన్ కొత్త పరిమితి
ఈ నెల నుండి ATM నుండి డబ్బు తీసుకోవడానికి రూల్స్ కూడా మారాయి. అప్ డేట్ చేసిన నిబంధనల ప్రకారం, మెట్రో నగరాల్లోని ప్రజలు నెలకు 3 సార్లు ATMల నుండి ఉచితంగా డబ్బు విత్ డ్రా తీసుకోవచ్చు. దీని తరువాత ప్రతి ట్రాన్సక్షన్'కి రూ.25 ఛార్జీ విధించబడుతుంది, ఇంతకుముందు చార్జెస్ రూ.20గా ఉండేవి. మీరు వేరే బ్యాంకు ఏటీఎం నుండి డబ్బు తీసుకుంటుంటే రూ.30 చార్జెస్ వసూలు చేస్తుంది. నాన్-మెట్రోలలో ఈ పరిమితి 5గా ఉంచారు.
డిపాజిట్లపై విధించే చార్జెస్
కోటక్ మహీంద్రా బ్యాంక్ 811 సేవింగ్స్ అకౌంట్ రూల్స్ మార్చింది. నెలకు రూ.10,000 మించి క్యాష్ డిపాజిట్ చేస్తే ప్రతి రూ.1,000 కు రూ.5 చొప్పున చార్జెస్ వసూలు చేస్తుంది. ATM రిజెక్షన్ (decline) చార్జెస్ (రూ. 25) ఇప్పుడు నాన్ కోటక్ ATMలకు మాత్రమే వర్తిస్తాయి. స్టాండింగ్ ఇన్‌స్ట్రక్షన్ ఫెయిల్యూర్ చార్జెస్ రూ.200 నుండి రూ.100కు తగ్గించారు.
IDFC ఫస్ట్ క్రెడిట్ కార్డ్
ఫిబ్రవరి 20 నుండి IDFC ఫస్ట్ క్రెడిట్ కార్డ్‌లో చాల మార్పులు చేయనుంది. CRED ఇంకా PayTM వంటి ద్వారా చేసే ఎడ్యుకేషన్ పేమెంట్లకు స్టేట్‌మెంట్ తేదీలు మార్చనుంది అలాగే కొత్త ఛార్జీలు వర్తిస్తాయి. కార్డ్ రీప్లేస్‌మెంట్ ఫీజు ఇప్పుడు రూ. 199 పైగా పెరిగింది.
వడ్డీ రేట్లపై గమనిక
కొద్దిరోజుల క్రితం గత ఐదు సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించింది. దీని తరువాత బ్యాంకులు రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వగలవు. దీనితో పాటు, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీలో మార్పు కూడా సాధ్యమే. రెపో రేటు అంటే ఆర్‌బిఐ బ్యాంకులకు రుణాలు ఇచ్చే వడ్డీ రేటు. రిజర్వ్ బ్యాంకు ఈ రేటును తగ్గించినప్పుడు, బ్యాంకులు తక్కువ ఖర్చుతో డబ్బు తీసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications