ప్రభుత్వ ఉద్యోగం కోసం చేస్తున్నవారికి గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజగా ఉద్యోగ నోటిఫికేషన్ 2025 విడుదల చేసింది. మీరు బ్యాంకింగ్ రంగంలో జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఈ సమాచారం మీకోసం. అందుబాటులో ఉన్న అఫీషియల్ వెబ్ సైట్ ప్రకారం దరఖాస్తులు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
ఈ నోటికేషన్ ద్వారా అప్రెంటిస్ పోస్టులకు నియామకాలు నిర్వహిస్తుందని అభ్యర్థులు గమనించాలి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులకు దరఖాస్తుల ప్రక్రియ చివరి తేదీ మార్చి 15. ఢిల్లీ, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, త్రిపుర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్‌తో సహా మరిన్ని రాష్ట్రాల్లో ఈ పోస్టుల నియామకాలు జరుగుతున్నాయి.

ఖాళీల నియామక పోస్టుల వివరాలు చూస్తే: ఎస్సిలకి - 52 పోస్టులు, ఎస్టీలకు -40 పోస్టులు, ఓబిసిలకి - 81 పోస్టులు, ఆర్థికంగా బలహీన వర్గాలకి (EWS)-32 పోస్టులు, జనరల్ కేటగిరీకి 195 పోస్టులు, పిడబ్ల్యుబిడిలకి16 పోస్టులు కలిపి మొత్తంగా 400 పోస్టులకు రిక్రూట్మెంట్ నివహిస్తున్నాయి.
BOI అప్రెంటిస్ ఉద్యోగ అర్హతలు: ఈ ఖాళీ పోస్టుల నియామకానికి అర్హతగల అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. అలాగే అర్హతకు సంబంధించిన మరిన్ని వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో చూడాల్సి ఉంటుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్లికేషన్ ఫామ్ నింపే అభ్యర్థుల కనీస వయస్సు 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే అభ్యర్థి 1997కి నుండి 2005 మధ్య జన్మించి ఉండాలి. అంతేకాదు రిజర్వేషన్ల ప్రకారం వయస్సులో సడలింపు ఉంటుంది.
సెలక్షన్ ప్రక్రియ: ఈ పోస్టుల సెలక్షన్ ప్రక్రియలో లోకల్ లాంగ్వేజ్ టెస్ట్, ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థుల క్యాటగిరి బట్టి అప్లికేషన్ ఫోజు రూ.400 నుండి రూ.800 మధ్య వరకు ఉంటుంది. ఈ అప్రెంటిస్‌షిప్ కాలం కూడా ఒక ఏడాది పాటు ఉంటుంది. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ గురించి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ ఇండియా అఫీషియల్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ఎలా అప్లయ్ చేసుకోవచ్చు అంటే: ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోకోవాలంటే మీరు ముందుగా bankofindia.co.in అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి. తర్వాత వెబ్‌సైట్‌లో 'కెరీర్' సెక్షన్ వెళ్ళ్లాలి. దీని తర్వాత 'అప్రెంటిస్ రిక్రూట్‌మెంట్ 2025' లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. కొత్త యూజర్‌గా రిజిస్టర్ చేసుకుని మీ వివరాలు పూర్తిగా నింపాల్సి ఉంటుంది. తరువాత అప్లికేషన్ ఫార్మ్ నింపండి. ఆ తర్వాత కోరిన డాకుమెంట్స్ అప్‌లోడ్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications