Adani Group: ఒకపక్క అదానీకి చెందిన అనేక కంపెనీల పతనం మార్కెట్లో కొనసాగుతూనే ఉంది. దీనిని కట్టడి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలు పూర్తి స్థాయిలో ఫలితాలను ఇవ్వటం లేదు. ఈ క్రమంలో చాలా మ్యూచువల్ ఫండ్ కంపెనీలు సైతం అదానీ గ్రూప్ కంపెనీల్లో పెట్టుబడులకు దూరంగా జరుగుతున్నాయి.

ఈరోజు మార్కెట్లో..
అదానీ గ్రూప్ కంపెనీల్లో ఓలటాలిటీ భారీగానే కొనసాగుతోంది. ఈరోజు మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ పోర్ట్స్ స్టాక్స్ మాత్రం టాప్ లూజర్స్ గా కొనసాగుతున్నాయి. ప్రతిపక్షాలు సైతం ఎల్ఐసీ, ప్రభుత్వ బ్యాంకులు అదానీ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయకుండా చూడాలని కోరుతున్నాయి. ప్రజాధనాన్ని కాపాడాలని వారు సూచిస్తున్న విషయం తెలిసిందే.

బ్యాంక్ ఆఫ్ బరోడా..
ఇలాంటి సందర్భంలో దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడా అదానీ కంపెనీలకు రుణాలను ఇవ్వటం కొనసాగిస్తుందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ & మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ చద్దా తెలిపారు. అయితే పూచీకత్తు ప్రమాణాలకు అనుగుణంగానే రుణాల మంజూరు జరుగుతుందని ఆయన వెల్లడించారు. అదానీ స్టాక్‌ల చుట్టూ ఉన్న మార్కెట్ అస్థిరత గురించి తాను ఆందోళన చెందడం లేదని సంజీవ్ చద్దా వెల్లడించారు.

ముంబై ధారావీ ప్రాజెక్ట్..
మహారాష్ట్ర ప్రభుత్వం అదానీకి ముంబైలోని అతిపెద్ద మురికివాడ ధారావీ అభివృద్ధి కాంట్రాక్ట్ ను 50.7 బిలియన్ రూపాయలకు బిడ్ చేసి గెలుచుకుంది. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా బ్రిడ్జి ఫైనాన్స్ అందించటాన్ని పరిశీలిస్తోదని చద్దా తెలిపారు. వచ్చే నెలలో రీఫైనాన్సింగ్ కోసం అదానీ ఎదురుచూస్తున్న తరుణంలో బ్యాంక్ సానుకూలంగా ప్రకటన చేయటం పెద్ద ఊరట అని చెప్పుకోవాలి.

తగ్గిన అదానీ సంపద..
ప్రపంచ కుబేరుడిగా ఆసియా నుంచి రికార్డు సృష్టించిన గౌతమ్ అదానీ హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత కుప్పకూలారు. ప్రస్తుతం అదానీ సంపద 50 బిలియన్ డాలర్ల కంటే తక్కువకు పడిపోయింది. దీంతో ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితాలో అదానీ 25వ స్థానానికి చేరుకున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications