బ్యాంక్ ఆఫ్ బరోడా తన కస్టమర్లకు గురువారం గుడ్‌న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ నేపథ్యంలో హోమ్ లోన్, కారు లోన్ పైన వడ్డీ రేట్లను తగ్గించింది. హోమ్ లోన్, వెహికిల్ లోన్స్ పైన వడ్డీరేట్లను 0.25 శాతం మేర తగ్గించింది. హోమ్ లోన్‌పై వడ్డీరేటు 6.75 శాతంతో, కారు లోన్ వడ్డీ రేటు 7 శాతంతో ప్రారంభమవుతుందని తెలిపింది. హోమ్ లోన్ పైన ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగిస్తున్నట్లు ప్రకటనలో తెలిపింది. ఈ సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. తక్షణ రుణ మంజూరు కోసం కస్టమర్లు బ్యాంక్ ఆఫ్ బరోడా మొబైల్ బ్యాంకింగ్ యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చునని మోర్టగేజెస్, ఇతర రిటైల్ ఆస్తుల విభాగం జనరల్ మేనేజర్ సోలంకి వెల్లడించారు.

హోమ్ లోన్, కారు లోన్ కోసం దరఖాస్తు
హోమ్‌లోన్, కారు లోన్ కోసం కస్టమర్లు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవచ్చునని, డోర్ స్టెప్ సేవలు కూడా అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో రిటైల్ లోన్ ఆఫర్లను ప్రవేశపెట్టడం ద్వారా తమ కస్టమర్లకు పండుగ ఉత్సహాన్ని అందిస్తున్నామని సోలంకి అన్నారు. ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపు ప్రయోజనం కూడా పొందుతున్నారని తెలిపారు. ఇప్పటికే ఉన్న తమ కస్టమర్లకు, కొత్త కస్టమర్లకు ఈ ఆఫర్ ప్రయోజనకరమని తెలిపారు. అలాగే, ప్రాసెసింగ్ ఫీజును మినహాయించడం ద్వారా కూడా ప్రయోజనం పొందుతారని తెలిపారు.

ఎస్బీఐ కూడా గుడ్ న్యూస్
కాగా, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) కూడా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. పండుగ సీజన్ నేపథ్యంలో క్రెడిట్ స్కోర్ లింక్డ్ హోమ్ లోన్స్‌ను తక్కువ ధరకే అందిస్తోంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో గత ఏడాది కాలంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు, పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు తగ్గుతున్నాయి. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో రుణ రేటు కూడా తగ్గింది. అయితే రుణరేటును పెంచేందుకు వివిధ బ్యాంకులు ఆఫర్లు ఇస్తున్నాయి. ఇందులో భాగంగా ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీ రేటును 6.7 శాతానికి ఇస్తున్నట్లు ప్రకటించింది. క్రెడిట్ స్కోర్ ఆధారంగా కస్టమర్లు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. అలాగే, ఆఫర్ కింద ప్రాసెసింగ్ ఫీజును కూడా తొలగించినట్లు బ్యాంకు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.

ఎస్బీఐలో బదలీకి కూడా
అంతకుముందు రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో హోమ్ లోన్ తీసుకునేవారు 7.15 శాతం వడ్డీరేట్లు చెల్లించాలి. అయితే ఈ పండగ ఆఫర్‌తో కొత్తగా హోమ్ లోన్ తీసుకునేవారికి ఎంత మొత్తం రుణానికైనా 6.70 వడ్డీరేటు ఉంటుందని బ్యాంకు వెల్లడించింది. దీంతో 30 ఏళ్ల కాలవ్యవధితో రూ.75 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో రుణం తీసుకునే వారికి వడ్డీ భారం 45 బేసిస్ పాయింట్ల తగ్గడంతో పాటు రూ.8 లక్షలు ఆదా అవుతుందని తెలిపింది. ఇప్పటి వరకు వేతన ఆధారిత కస్టమర్లతో పోలిస్తే ఇతర కస్టమర్లకు హోమ్ లోన్ పైన వడ్డీ రేటు 15 బేసిస్ పాయింట్లు ఎక్కువగా ఉంది. తాజా ఆఫర్‌లో ఈ తేడాను తొలగించినట్లు ఎస్బీఐ వెల్లడించింది. వృత్తి, రుణ మొత్తం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రతి కస్టమర్‌కు హోమ్ లోన్స్ పైన ఒకే వడ్డీ రేటును అందిస్తున్నట్లు తెలిపింది. హోమ్ లోన్స్‌ను బదలీ చేసుకునే వారికి కూడా ఇది వర్తిస్తుంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications