Bank Of Baroda: శుభవార్త చెప్పిన బ్యాంక్ ఆఫ్ బరోడా.. దేశవ్యాప్తంగా అమలు..
Bank Of Baroda: ప్రభుత్వ యాజమాన్యంలోని అతిపెద్ద బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఒకటి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో వస్తున్న మార్పులను వేగంగా ప్రజలకు చేరువచేస్తోంది.
ఈ క్రమంలో దేశవ్యాప్తంగా UPI ATMలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌలభ్యం మెుత్తం 6,000 ఏటీఎంలలో ప్రారంభించినట్లు శుక్రవారం ప్రకటించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) సమన్వయంతో NCR కార్పొరేషన్ ద్వారా నిర్వహించబడే UPI ATMలను దేశంలో ప్రారంభించిన తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది.

UPI ఎనేబుల్డ్ మొబైల్ యాప్ ద్వారా తమ డెబిట్ కార్డ్‌లను ఉపయోగించకుండానే యూజర్లు ఇకపై UPI ATMల నుంచి నగదు ఉపసంహరణ చేసుకోవచ్చని ప్రకటించింది. ఇతర బ్యాంక్ వివియోగదారులు సైతం దీని ద్వారా డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చని బ్యాంక్ స్పష్టం చేసింది. UPI ATM అనేది ఇంటర్‌ఆపరబుల్ కార్డ్‌లెస్ క్యాష్ విత్‌డ్రావల్(ICCW) సాంకేతికత ద్వారా QR-ఆధారిత సేవలను అనుమతిస్తుంది. ఇది భద్రతను పెంచటంతో పాటు నగదు విత్‌డ్రా చేయడానికి డెబిట్ కార్డ్ అవసరం లేకుండా చేస్తుంది.
ఇదే క్రమంలో యూనియన్ బ్యాంక్ సైతం యూపీఐ ఆధారంగా డబ్బులను ఏటీఎం నుంచి విత్ డ్రా చేసుకునేందుకు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఈ క్రమంలో ఇటీవల ముంబైలో జరిగిన గ్లోబల్ ఫిన్ టెక్ ఫెస్ట్ వద్ద అందుబాటులో ఉంచింది. BHIM అధికారిక యాప్ ద్వారా ఏ బ్యాంక్ ఖాతా కలిగిన వినియోగదారులైన తమ సొమ్మును విత్ డ్రా చేసుకునేందుకు వెసులు బాటు కల్పించింది. నగదు ఉపసంహరణ ప్రక్రియను పైన ఉంచిన వీడియోలో ఎలా సులువుగా చేసుకోవాలి చూసి తెలుసుకోవచ్చు.


Click it and Unblock the Notifications