Q4 Results: బ్యాంక్ ఆఫ్ బరోడా దిమ్మతిరిగే లాభాలు.. డివిడెండ్ ప్రకటన..
Bank of Baroda: దేశంలో ప్రభుత్వ యాజమాన్యంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. దీనికి తోడు ఇటీవల కంపెనీ బీవోబీ వరల్డ్ యాప్‌పై ఆర్బీఐ గతంలో విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా జనవరి-మార్చి త్రైమాసికంలో రూ.4,886.49 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని నివేదించింది. కిందటి ఏడాది ఇదే సమయంలో కంపెనీ నికర లాభం రూ.4,775.33 కోట్ల కంటే 2.3 శాతం వృద్ధిని సాధించింది. శుక్రవారం స్టాక్ మార్కెట్లు ముగిసే సమయానికి బ్యాంక్ ఆఫ్ బరోడా షేర్లు బీఎస్ఈలో 5.36 శాతం పడిపోయి రూ.248.55కి చేరుకున్నాయి. దీంతో మార్కెట్ క్యాప్ ఏకంగా రూ.1.30 లక్షల కోట్లు పడిపోయింది. నాలుగో త్రైమాసికంలో బ్యాంక్ నిర్వహణ లాభం 0.4 శాతం పెరిగి రూ.8,106 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే సమయంలో నిర్వహణ లాభం రూ.8,073 కోట్లుగా ఉంది.

మార్చి త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తులు గత ఏడాది ఇదే కాలంలో ఉన్న 3.79 శాతం నుంచి ప్రస్తుతం 2.92 శాతానికి పడిపోయాయి. నికర ఎన్‌పీఏలు ఏడాది ప్రాతిపదికన 0.89 శాతం నుంచి క్యూ4లో 0.68 శాతానికి పడిపోయాయి. జనవరి-మార్చి త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 2.3% పెరిగి రూ.11,793 కోట్లకు చేరుకుంది. గ్లోబల్ నికర వడ్డీ మార్జిన్ వరుసగా 17 బేసిస్ పాయింట్లు పెరిగింది. Q4FY24లో స్థూల నిరర్థక ఆస్తులు Q3FY24లో రూ.32,317.56 కోట్ల నుంచి రూ.31.833,63 కోట్లకు 1.5% క్షీణించడంతో ఆస్తి నాణ్యత మెరుగుపడింది. నికర ఎన్‌పీఏలు రూ.7,208.31 కోట్ల నుంచి రూ.7,213.34 కోట్లకు పెరిగాయి.
మార్చి 31, 2024 నాటికి బ్యాంక్ రూ.899.56 కోట్ల అదనపు కేటాయింపులు చేసింది. ఈ క్రమంలో కంపెనీ షేర్ హోల్డర్లకు ఒక్కో షేరుపై రూ.7.60 డివిడెండ్ చెల్లించాలని డైరెక్టర్ల బోర్డ్ సిఫార్సు చేసింది. అయితే దీనికి షేర్ హోల్డర్ల నుంచి అవసరమైన ఆమోదాలను పొందాల్సి ఉంది. స్టాక్ 0.9 బీటాను కలిగి ఉంది. ఇది సంవత్సరంలో తక్కువ అస్థిరతను సూచిస్తుంది. బ్యాంకింగ్ స్టాక్ ఒక సంవత్సరంలో 43.01% లాభపడింది. ఈ సంవత్సరం 9.11% పెరిగింది.


Click it and Unblock the Notifications