Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాకు సంబంధించిన వాస్తవాలు ఒకటి తర్వాత మరొకటి వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా అంతర్గత ఆడిట్ ద్వారా బ్యాంకులో జరిగిన మోసం గురించిన వివరాలు బయటపడ్డాయి.
ప్రభుత్వ యాజమాన్యంలో నడుస్తున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ఏజెంట్లు తన కస్టమర్ల ఖాతాల నుంచి డబ్బును దొంగిలించడం సులభం చేసిందనే వార్తలు మార్కెట్లో సంచలనంగా మారిపోయాయి. దాదాపు 362 మంది కస్టమర్ల ఖాతాల నుంచి రూ.23 లక్షల సొమ్ము దొంగిలించబడినట్లు అంతర్గత ఆడిట్ నివేదికలు, బ్యాంక్ రికార్డులు వెల్లడించాయి. ప్రముఖ వార్తా సంస్థలో వచ్చిన కథనం తర్వాత బ్యాంక్ అధికారులు ఈ అంతర్గత ఆడిట్ నిర్వహించారు.

బ్యాంక్ ఉద్యోగులు తమ బ్యాంక్ కొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ bob World ఆన్‌బోర్డ్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ లేని కస్టమర్ల ఖాతాలకు అనధికారికంగా మొబైల్ నంబర్‌లను లింక్ చేసినట్లు వార్తా సంస్థ వెల్లడించింది. ఇక్కడ లింక్ చేయబడిన అనధికార మొబైల్ నంబర్లు బ్యాంకు సిబ్బంది, మేనేజర్లు, గార్డులు, వారి బంధువులు, మారుమూల ప్రాంతాల్లోని బ్యాంకు ఏజెంట్లకు సంబంధించినవిగా గుర్తించినట్లు సమాచారం. ఎక్కువ మంది కస్టమర్లను ఆన్ బోర్డ్ చేయాలని బ్యాంక్ నిర్థేశించిన ప్లాన్ ఒత్తిడి కారణంగా కొందరు దుర్వినియోగం చేయటంపై కథనం హెచ్చరించింది.
ఇప్పుడు బ్యాంక్ ప్రధాన కార్యాలయ అంతర్గత పత్రాలు ఈ అక్రమాన్ని అంగీకరిస్తున్నాయి. వ్యాపార కరస్పాండెంట్‌లుగా పిలువబడే బ్యాంక్ ఏజెంట్లు మొబైల్ బ్యాంకింగ్‌ని ఉపయోగించి ఖాతాదారుల ఖాతాల నుంచి రూ.10,000 విత్‌డ్రా చేసినట్లు చూపుతున్నాయి. అలాగే ఒక ఏజెంట్ అత్యధికంగా రూ.3.90 లక్షలు ఖాతాదారుల అకౌంట్ నుంచి తస్కరించినట్లు వెల్లడైంది. ఈ క్రమంలోనే ఆరుగురు కస్టమర్ల అఖౌంట్ల నుంచి రూ.1,10,000 దొంగిలించబడ్డాయి. మోసం గురించి బయటపడటంతో రెగ్యులేటర్ రిజర్వు బ్యాంక్ దీనిపై స్పందించింది. బాబ్ వరల్డ్‌లో కొత్త కస్టమర్‌లను నమోదు చేయడాన్ని నిలిపివేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడాకు తక్షణ ఆదేశాలను జారీ చేసింది.


Click it and Unblock the Notifications