భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ ప్రపంచ స్థాయికి ఎదగబోతోంది. ఇందులో భాగంగానే మరోసారి బ్యాంకుల విలీనం జరగనుంది. దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల (PSU Banks)ను బలోపేతం చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలోని టాప్ 100 బ్యాంకుల్లో స్థానం సంపాదించాలంటే.. చిన్న బ్యాంకులన్నీంటిని కలిపి దిగ్గజ బ్యాంకులుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. బ్యాంకుల విలీనం ద్వారా బ్యాంకుల ఆదాయం, మార్కెట్ వాల్యూ, సామర్థ్యం భారీగా పెరగనున్నాయి. దేశంలోని అతిపెద్ద బ్యాంక్ అయిన రుణదాత అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) కూడా ఈ విలీనానికి పూర్తి మద్దతు ఇస్తోంది. ఇందులో భాగంగా మొత్తం ఆరు స్వతంత్ర బ్యాంకులు విలీనం అవ్వనున్నాయి.
బ్యాంకులు ఇవే..
త్వరలో జరగబోయే విలీనంలో ఈ ఆరు బ్యాంకులను పెద్ద బ్యాంకుల్లో కలిపే దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ ఆరు బ్యాంకులు ఒకదానితో మరొకటి లేదా ఇతర బ్యాంకులతో కలిసిపోయే అవకాశం ఉంది.
• బ్యాంక్ ఆఫ్ ఇండియా (Bank of India)
• ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (Indian Overseas Bank)
• సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank of India)
• బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank of Maharashtra)
• యూకో బ్యాంక్ (UCO Bank)
• పంజాబ్ & సింధ్ బ్యాంక్ (Punjab & Sind Bank)
ఎందుకు ఈ మార్పు?
• ఆర్థిక బలం: బ్యాంకుల ఆర్థిక పునాదిని బలోపేతం చేసి వాటికి అవసరమైన శక్తిని ఇవ్వడం.
• నాణ్యత మెరుగుదల: మొండి బకాయిల భారాన్ని తగ్గించి రుణ నాణ్యతను పెంచడం.
• సాంకేతికతతో పరుగు: డిజిటల్, ఫిజికల్ మౌలిక సదుపాయాలను ఆధునికీకరించి, వేగవంతమైన సేవలు అందించడం.
• మెరుగైన పాలన: రిస్క్ మేనేజ్ మెంట్ సామర్థ్యాన్ని పెంచి పారదర్శకతను తీసుకురావడం.
గతంలో ఇలా..
గత మూడు దశాబ్దాలలో భారతీయ బ్యాంకింగ్ రంగంలో విలీనాలు ఒక కీలక పాత్ర పోషించాయి. 2017 నుండి జరిగిన ముఖ్యమైన మార్పులను ఒకసారి గమనిస్తే.. 2017లో SBI లో 6 అనుబంధ బ్యాంకులు విలీనం అయ్యాయి. ఫలితంగా SBI భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ గా ఆవిర్భవించింది. 2019లో బ్యాంక్ ఆఫ్ బరోడాలో విజయా బ్యాంక్, దేనా బ్యాంక్ విలీనం అయ్యాయి. దేశంలో అతిపెద్ద జాతీయ రుణదాతలలో ఒకటిగా అవతరించింది. 2020లో పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం అయ్యాయి ఫలితంగా.. బ్రాంచ్ నెట్‌వర్క్ పరంగా భారతదేశంలో రెండవ అతిపెద్ద PSU బ్యాంక్ గా మారింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ విలీనం అవ్వడం ద్వారా యూనియన్ బ్యాంక్ ఐదవ అతిపెద్ద PSU రుణదాతగా మారింది.
2026 లో ఇలా..
వచ్చే ఏడాది 2026 ఏప్రిల్ నెలలో ఈ విలీనం జరిగే అవకాశం ఉందని వార్తలొస్తున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలను.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకులలో విలీనం చేసే అవకాశం ఉంది. ఫ్యూచర్ లో దేశంలో కొన్ని బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. తద్వారా భారతీయ బ్యాంకులు అంతర్జాతీయ స్థాయిలో ఎదిగే అవకాశం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications