ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (ఫిబ్రవరి 17) భారీ నష్టాల్లో ముగిశాయి. ఉదయం దాదాపు నాలుగు వందల పాయింట్ల నష్టంతో ప్రారంభమైన మార్కెట్లు రోజంతా తీవ్ర ఒడిదుడుకుల్లో కదలాడాయి. చివరకి దాదాపు ప్రారంభంలోని నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ కష్టంగా 15,200 పాయింట్ల పైన ముగిసింది. ఐఐఎఫ్ఎల్ ఫైనాన్స్ 9 శాతం, నెస్ట్లే 3 శాతం నష్టపోయాయి. బ్యాంకు, ఐటీ స్టాక్స్ భారీగా నష్టపోవడంతో సూచీలు పతనమయ్యాయి. సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 22 నష్టాల్లో ముగిశాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్ ర్యాలీ కొనసాగించాయి. సెన్సెక్స్ 52,000 పాయింట్ల దిగువన ముగిసింది.

నష్టాల్లో ముగింపు
సెన్సెక్స్ 400.34 పాయింట్లు లేదా 0.77% నష్టపోయి 51,703.83 పాయింట్ల వద్ద, నిఫ్టీ 104.60 పాయింట్లు లేదా 0.68% క్షీణించి 15,208.90 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. 1480 షేర్లు లాభాల్లో, 1422 షేర్లు నష్టాల్లో ముగియగా, 144 షేర్లలో ఎలాంటి మార్పులేదు. సెన్సెక్స్ 51,996.94 పాయింట్ల వద్ద ప్రారంభమై, 52,078.15 వద్ద గరిష్టాన్ని, 51,586.34 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. డాలర్ మారకంతో రూపాయి స్వల్పంగా క్షీణించి 72.75 వద్ద క్లోజ్ అయింది. ఉదయం 72.92 వద్ద ప్రారంభమైంది. నేటి సెషన్లో 72.72-72.93 మధ్య ట్రేడ్ అయింది.

నేటి టాప్ గెయినర్స్, లూజర్స్
నేటి టాప్ గెయినర్స్ జాబితాలో హీరో మోటోకార్ప్ 3.54 శాతం, అదానీ పోర్ట్స్ 3.02 శాతం, SBI 2.34 శాతం, పవర్ గ్రిడ్ కార్పోరేషన్ 2.10 శాతం, HDFC లైఫ్ 2.02 శాతం లాభపడ్డాయి.
టాప్ లూజర్స్ జాబితాలో నెస్ట్లే 2.76 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 2.63 శాతం, ఏషియన్ పేయింట్స్ 2.53 శాతం, మారుతీ సుజుకీ 2.52 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు 2.47 శాతం నష్టపోయాయి.
మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, రిలయన్స్, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నేడు 0.96 శాతం లాభపడి రూ.2080 వద్ద ట్రేడ్ అయింది.

రంగాలవారీగా...
నిఫ్టీ 50 స్టాక్స్ 0.68 శాతం నష్టపోగా, నిఫ్టీ మిడ్ క్యాప్ 0.32 శాతం లాభపడ్డాయి.రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఆటో 0.28 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.97 శాతం, నిఫ్టీ మీడియా 2.18 శాతం, నిఫ్టీ మెటల్ 0.17 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 5.86 శాతం, లాభపడ్డాయి.నిఫ్టీ బ్యాంకు 0.51 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 1.10 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 0.61 శాతం, నిఫ్టీ ఐటీ 1.29 శాతం, నిఫ్టీ ఫార్మా 1.72 శాతం, నిఫ్టీ రియాల్టీ 0.64 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.95 శాతం నష్టపోయాయి.
More From GoodReturns

Stock market: స్టాక్ మార్కెట్ ఊపు! ఒక్కరోజే 2000 పాయింట్లు జంప్..ఈ 5 కారణాలే కీలకం!

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?



Click it and Unblock the Notifications