SBI: ప్రపంచం పూర్తిగా మారవచ్చు, కానీ మీ సేవలు మారవు.. ఇజ్జత్ తీసిన కస్టమర్..!
ఖాతాదారులకు సేవలు అందించడంలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం వహించిన వీడియోలు ఎన్నో వైరల్ అయ్యాయి. తాజాగా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ ఉద్యోగులకు సంబంధించి ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ బ్రాంచ్ సేవలను కస్టమర్లకు అందించలేకపోయింది. ఆ సమయంలో మొత్తం సిబ్బంది సామూహికంగా భోజనం చేస్తున్నారు.
మే 30న ఒక కస్టమర్ SBI బ్రాంచ్ ఫోటో తీసి, మొత్తం సిబ్బందిని లంచ్ బ్రేక్‌లో చూపిస్తూ, X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశాడు ఓ వ్యక్తి. ఫొటోతో పాటు "ప్రపంచం పూర్తిగా మారవచ్చు, కానీ మీ సేవలు మారవు" రాసుకొచ్చాడు. "మధ్యాహ్న 3 గంటలు అవుతుంది. మొత్తం సిబ్బంది భోజనంలో ఉన్నారు. ఒక వైపు #SBI మాకు భోజన విరామం లేదు, మొత్తం సిబ్బంది సమిష్టిగా భోజనం చేశారు. ప్రియమైన @TheOfficialSBI, ప్రపంచం కూడా పూర్తిగా మారవచ్చు కానీ మీ సేవలు మారవు" అని లలిత్ సోలంకి ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ట్వీట్ కు 398k వ్యూస్ 6.3 లైక్‌లతో తక్షణమే వైరల్‌గా మారింది. దీంతో SBI అధికారిక X హ్యాండిల్ ద్వారా స్పందించింది. కలిగించిన అసౌకర్యంపై విచారం వ్యక్తం చేసింది. ట్వీట్‌ను తొలగించమని సోషల్ మీడియా వినియోగదారుని కోరింది. ఈ ట్వీట్ కూడా 122కె వ్యూస్‌తో వైరల్‌గా మారింది. "మీకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము. అయితే భద్రతా కారణాల దృష్ట్యా బ్రాంచ్ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ/వీడియోగ్రఫీ నిషేధించాం. దయచేసి గమనించండి. వీటిని దుర్వినియోగం చేస్తే మీరు బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీటిని తీసివేయమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము " అని ఎస్బీఐ ట్వీట్ చేసింది.
దీంతో సీఏ లలిత్ సోలంకి ట్వీట్‌ను డిలీట్ చేశారు. దీనిపై ఎస్బీఐ మరో ట్వీట్ చేసింది. "మా బ్రాంచ్‌లలోని సిబ్బంది భోజన సమయానికి నిర్దిష్ట సమయాలు ఏవీ నిర్ణయించలేదు. పనివేళల్లో మా గౌరవనీయమైన కస్టమర్‌లకు నిరంతర సేవలు విస్తరింపజేసేందుకు బ్రాంచ్‌లలో మధ్యాహ్న భోజన వేళలు అస్థిరంగా ఉంటాయి. అయితే, మీరు మా బ్రాంచ్‌లలో దేనినైనా దీనికి సంబంధించి ఏదైనా సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే, దయచేసి ఈ లింక్‌లో ఫిర్యాదును నమోదు చేయండి. https://crcf.sbi.co.in/ccf ఫిర్యాదు చేయండి. మా సంబంధిత బృందం ఫిర్యాదును పరిశీలిస్తుంది" అని పేర్కొంది.


Click it and Unblock the Notifications