ఈ నెలలో మీకు ఏమైనా బ్యాంకులో పెండింగ్ పనులు ఉన్నాయా? అయితే వాటిని వెంటనే పూర్తి చేసుకోండి. ఎందుకంటే ఈ నెల చివరి నుండి వచ్చే వారం 4వ తారీఖు వరకు బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పని చేస్తాయి. ఈ సమయంలో బ్యాంకులో పనులు చేసుకోవాలని ఎవరైనా భావిస్తే ముందే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. మీ బ్యాంకు పనులు ముగించుకోవడానికి మీ ముందున్న ఆప్షన్స్.. ఈ వారంలోనే పనులు ముగించుకోవడం లేదా 4వ తేదీ వరకు వేచి ఉండటం. ఈ కాలంలో తెరిచి ఉండే రెండు రోజుల్లో పనులు పూర్తి కాకపోవచ్చు.

27 నుండి 3 వరకు
ఈ నెల 27వ తేదీ నుండి 29వ తేదీ వరకు వరుసగా మూడు రోజులు బ్యాంకులు పని చేయవు. ఈ నెల 27న నాలుగో శనివారం, 28న ఆదివారం, 29న హోలీ పర్వదినం. కాబట్టి ఈ మూడు రోజులూ బ్యాంకులు మూసివేసి ఉంటాయి. మార్చి 30 న పాట్నాలో సెలవు ఉంది. మార్చి 31 న ఆర్థిక సంవత్సరం ముగింపు రోజు కావడంతో బ్యాంకుల్లో కస్టమర్లకు సేవలు అందుబాటులో ఉండవు. ఏప్రిల్ 1వ తేదీన బ్యాంకు సేవలు సాధారణ కస్టమర్లకు అందుబాటులో ఉండవు. ఆ రోజు బ్యాంకులు వార్షిక ఖాతాల క్లోజింగ్/ఓపెనింగ్ ప్రక్రియల్లో ఉంటాయి. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడ్. మార్చి 27 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఈ తొమ్మిది రోజుల్లో ఏడు రోజులు బ్యాంకులు పని చేయవు. కాబట్టి ముందుగానే పనులు పూర్తి చేసుకోవడం మంచిది.

ఎనిమిది పండుగ సెలవులు
ఇక, ఆర్బీఐ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ నెలలో బ్యాంకులు పద్నాలుగు రోజులు క్లోజ్ అవుతాయి. ఎనిమిది రోజులు వివిధ పండుగల సెలవులు. ఏప్రిల్ ఒకటిన బ్యాంక్ క్లోజింగ్ డే. నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు మూసివేసి ఉంటాయి.

ఏప్రిల్ నెలలో సెలవులు ఇలా
ఏప్రిల్ 1న క్లోజింగ్ డే. 2న గుడ్ ఫ్రైడే, 4న ఆదివారం, 5న బాబూ జగ్జీవన్ రామ్ జయంతి, 10న రెండోశనివారం, 11న ఆదివారం, 13న గుడి పడ్వా/ఉగాది, 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి /తమిళ సంవత్సరాది, 15న హిమాచల్ డే/బెంగాల్ సంవత్సరాది, 16న బొహాగ్ బిహు (అసోంలో సెలవు), 18న ఆదివారం, 21న శ్రీరామనవమి, 24న నాలుగో శనివారం, 25న ఆదివారం. బ్యాంకులకు అధికారిక సెలవులు ఉన్న రోజుల్లో కొన్ని రాష్ట్రాల్లో పని దినాలుగా ఉన్నాయి.

సెలవులు..
27 మార్చి 2021 - నాలుగో శనివారం
26 మార్చి 2021 - ఆదివారం
29 మార్చి 2021- హోలీ
30 మార్చి 2021- హోలీ సందర్భంగా పాట్నాలో సెలవు
31 మార్చి 2021 - ఆర్థిక సంవత్సరం చివరి రోజు
1 ఏప్రిల్ 2021 - బ్యాంకు అకౌంటింగ్
2 ఏప్రిల్ 2021- గుడ్ ఫ్రైడే
3 ఏప్రిల్ 2021 - బ్యాంకులు తెరిచి ఉంటాయి
4 ఏప్రిల్ 2021 - ఆదివారం
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications