సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు సెలవు రోజులు ఇవే..
సెప్టెంబర్ నెలలో పబ్లిక్ హాలీడేస్ ఎక్కువగాలేవు. కాబట్టి ఈ నెలలో బ్యాంకుల కార్యకలాపాలు ఎక్కువ రోజులు ఉంటాయి. ఆదివారాలు బ్యాంకులకు సెలవు రోజులు. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో అధికారిక స్థానిక పండుగలు వంటి అంశాలపై ఆధారపడి సెలవులు ఉంటాయి.
సెప్టెంబర్ 6 ఆదివారం, 12 సెప్టెంబర్ రెండో శనివారం, 13 సెప్టెంబర్ ఆదివారం, 20 సెప్టెంబర్ ఆదివారం, 26 సెప్టెంబర్ నాలుగో శనివారం, 27 సెప్టెంబర్ ఆదివారం అన్ని రాష్ట్రాల్లోను సెలవు రోజులు. తెలుగు రాష్ట్రాల్లోను బ్యాంకులు మూసివేసి ఉంటాయి. సెప్టెంబర్ 18వ తేదీన తెలంగాణలో బతుకమ్మ పర్వదినం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంది.

సెప్టెంబర్ 2న గ్యాంగ్‌టాక్, కొచ్చి, తిరువనంతపురంలలో శ్రీనారాయణగురు జయంతి సందర్భంగా సెలవు ఉంది. 17 సెప్టెంబర్ మహాలయ అమావాస్య కారణంగా అగర్తాలా, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో సెలవు ఉంది. 21 సెప్టెంబర్ శ్రీ నారాయణ గురు సమాధి డే కావున కొచ్చి, తిరువనంతపురంలో సెలవు ఉంది. దేశవ్యాప్తంగా జాతీయస్థాయిలో చెప్పుకోదగ్గ సెలవులు పెద్దగా లేనందున సెప్టెంబర్ నెలలో బ్యాంకులు యతావిధిగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయి.


Click it and Unblock the Notifications