జూలైలో బ్యాంకు సెలవులు..18 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్, 13 రోజులు హాలిడేస్
వచ్చే నెలలో బ్యాంకుల పని ఏమైనా పెట్టుకున్నారా..అయితే ఏ రోజు బ్యాంక్ పనిచేస్తుంది.. ఏ రోజు హాలిడ్ ఉంటుందనే దానిపై క్లారిటీ వచ్చేసింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తన జూలై నెల క్యాలెండర్ విడుదల చేసింది. ఆర్బీఐ క్యాలండర్ ప్రకారం.. 2025 జూలైలో దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకులకు 13 రోజుల పాటు సెలవులు రానున్నాయి. వీటిలో ప్రాంతీయ సెలవులు, వారాంతపు మూసివేతలు కూడా ఉన్నాయి.
అయితే అధికారికంగా జూలె నెలలో ప్రభుత్వ సెలవు ఒక్కటి కూడా లేదు. అన్ని ఆదివారాలు, రెండు, నాలుగో శనివారాలు మాత్రమే ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక సెలవులు కూడా ఉన్నాయి. కాబట్టి మీకు వచ్చే నెలలో ఏదైనా బ్యాంక్ పని ఉంటే ముందు ప్లాన్ చేసుకోండి సెలవులను బట్టి. వచ్చే నెలలో బ్యాంకులు 18 రోజులు మాత్రమే పనిచేస్తాయి. అయితే బ్యాంకుకు వెళ్లే పని లేకుండా మీరు ఇంట్లోనే కూర్చుని లావాదేవీలు చేయవచ్చు. మీకు ఆన్‌లైన్ బ్యాంకింగ్ సౌకర్యం ఉంటే మీ మొబైల్ ద్వారానే మీ పనులను సులభంగా నిర్వహించుకోవచ్చు.

జూలైలో బ్యాంకు సెలవులు
జూలై 3 (గురువారం) - త్రిపురలోని అగర్తలాలో ఖర్చి పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జూలై 5 (శనివారం) - జమ్మూ కశ్మీర్ లో గురు హరోబింద్ జీ జయంతి సందర్భంగా మూసివేత ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
జూలై 6 - ఆదివారం. దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జూలై 12 - రెండో శనివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జూలై 13- ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జూలై 14 (సోమవారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో బెహ్ దేంఖ్లామ్ ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు క్లోజ్ అవుతాయి. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జూలై 16 (బుధవారం) - ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ లో హరేలా ఫెస్టివల్ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జూలై 17 (గురువారం) - మేఘాలయలోని షిల్లాంగ్ లో యు తిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జూలై 19 (శనివారం) - త్రిపురలోని అగర్తలాలో కేర్ పూజ సందర్భంగా బ్యాంకులు మూసివేయడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేస్తాయి.
జూలై 20 - ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు
జూలై 26 - నాలుగో శనివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జూలై 27 - ఆదివారం సందర్భంగా దేశమంతటా బ్యాంకులు పనిచేయవు.
జూలై 28 (సోమవారం) - సిక్కింలోని గ్యాంగ్‌టక్‌లో ద్రుక్పా త్షె-జీ సందర్భంగా మూసివేత ఉంటుంది. మిగతా రాష్ట్రాల్లో బ్యాంకులు యధావిధిగా పనిచేస్తాయి.
ఈ సెలవులు రాష్ట్రాలను బట్టి మారుతుంటాయి. ఆ రోజుల్లో దేశంలోని ఇతర రాష్ట్రాల్లో బ్యాంకు శాఖలు తెరిచే ఉంటాయి. ఆన్‌లైన్ బ్యాంకింగ్, ఏటీఎంలు, మొబైల్ బ్యాంకింగ్ సేవలు అన్ని సెలవు దినాల్లోనూ పనిచేస్తాయి. అయితే చెక్ క్లియరెన్స్, నెఫ్ట్, ఆర్టీజీఎస్ లావాదేవీల్లో మాత్రం స్వల్ప జాప్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సెలవులకు అనుగుణంగా మీరు ప్లాన్ చేసుకోండి.
ఇక జూన్ 28న నాలుగో శనివారం, జూన్ 29వ తేదీ ఆదివారం కావడంతో రెండు రోజులు బ్యాంకులకు సెలవుదినాలు. దేశవ్యాప్తంగా నాలుగో శనివారం, ఆదివారం అన్ని బ్యాంకులకు సెలవులు ఉండే విషయం తెలిసిందే. ఇక మిజోరం రాష్ట్రంలో రెమ్నా ని సందర్భంగా జూన్ 30వ తేదీ బ్యాంకులు మూతపడనున్నాయి. అక్కడ ప్రతి సోమవారం బ్యాంకులకు సెలవు కూడా ఉంటుంది.


Click it and Unblock the Notifications