ఈ నెలలో (డిసెంబర్) బ్యాంకుల్లో పని ఉన్న వారికి ఈ రోజు లాస్ట్ ఛాన్స్. శుక్రవారం నుండి బ్యాంకులు వరుసగా మూడు రోజుల పాటు క్లోజ్ అవుతున్నాయి. ఈ నెల 25వ తేదీన (శుక్రవారం) క్రిస్మస్, 26న నాలుగో శనివారం, 27న ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజుల పాటు బ్యాంకులకు సెలవు. వరుస సెలవు రోజులు కావడంతో ఏటీఎంలలోను నో క్యాష్ బోర్డులు ఉంటాయి. కాబట్టి ఖర్చులకు సరిపడే డబ్బులు ముందే చూసుకోవాలి. 28వ తేదీ నుండి బ్యాంకులు పని చేయనున్నాయి. ఇదిలా ఉండగా, జనవరి 2021సంక్రాంతి వంటి పర్వదినాలకు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆయా రాష్ట్రాలను బట్టి మార్పులు ఉంటాయి.

జనవరిలో సెలవు రోజులు
1 జనవరి 2021 - శుక్రవారం- ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
2 జనవరి 2021 - శనివారం - మన్నం జయంతి, కేరళ
11 జనవరి 2021 - సోమవారం- మిషనరీ డే, మిజోరాం
14 జనవరి 2021 - గురువారం - మకర సంక్రాంతి, తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో
15 జనవరి 2021 - శుక్రవారం - మగ్ బిహు/ తిరువళ్లూర్ డే/ కనుమ పండుగ, అసోం, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు
20 జనవరి 2021 - బుధవారం - గురు గోబింద్ సింగ్ జయంతి, చండీగఢ్, హర్యానా
23 జనవరి 2021 - శనివారం - నేతాజీ జయంతి, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిశా, అసోం
25 జనవరి 2021 - సోమవారం - సోనమ్ లోచార్/హిమాచల్ రాష్ట్ర దినోత్సవం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్
26 జనవరి 2021 - మంగళవారం, గణతంత్ర దినోత్సవం, భారత్ అంతా
31 జనవరి 2021 - ఆదివారం- మే-డామ్-మే-ఫీ, అసోం

పోస్టాఫీస్ సెలవులు
బ్యాంకు సెలవులతో పాటు పోస్టల్ సేవలు అందించే పోస్టాఫీస్‌కు కూడా సెలవులు ఉన్నాయి. 1688లో వారెన్ హాస్టింగ్స్ పోస్టల్ సేవలను ప్రారంభించారు. బ్యాంకులతో పాటు పోస్టాఫీస్ సెలవు రోజులు కూడా ముఖ్యమే. దాదాపు బ్యాంకులకు సెలవులు ఉన్న రోజుల్లోనే పోస్టాఫీస్‌కు సెలవులు ఉంటాయి. అయితే కాస్త చిన్న మార్పులు ఉంటాయి.

ఆదివారం క్లోజ్
ప్రభుత్వరంగ, ప్రయివేటురంగ బ్యాంకులు ఆదివారాలు, పండుగలు సహా వివిధ సందర్భాల్లో బ్యాంకులు క్లోజ్ అవుతాయి. బ్యాంకులు సాధారణంగా ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం క్లోజ్ అవుతాయి. ఇదిలా ఉండగా, పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ రిటర్న్ గడువు దాఖలు చేసేందుకు డిసెంబర్ 31వ తేదీ వరకు మాత్రమే గడువు ఉంది.


Click it and Unblock the Notifications