సంవత్సరంలో చివరి నెల డిసెంబర్ వచ్చేసింది. ఈ చలికాలంలో ముఖ్యమైన బ్యాంక్ పనులను ప్లాన్ చేసుకునే వారికి ఒక ముఖ్యమైన అప్ డేట్. అదేంటంటే వచ్చే నెలలో ఏకంగా 12 రోజుల బ్యాంక్ హాలిడేస్ ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారిక క్యాలెండర్ ప్రకారం డిసెంబర్ 2025లో వివిధ పండుగలు, ప్రాంతీయ సెలవులు, వీక్లీ ఆఫ్‌ల కారణంగా బ్యాంకులు సుమారు 12 రోజుల వరకు మూసివేయబడి ఉంటాయి. అవి ఏయే రోజులంటే..
డిసెంబర్ నెలలో ఒక నేషనల్ హాలిడే ఉంది. అదే క్రిస్మస్ (డిసెంబర్ 25). ఈ రోజున దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పూర్తిగా మూసి ఉంటాయి. అయితే మిగతా సెలవులు రాష్ట్రాల వారీగా పండుగలను బట్టి మారుతుంటాయి. మీ రాష్ట్రంలో సెలవు ఉన్నప్పుడు పక్క రాష్ట్రంలో బ్యాంక్ తెరిచే ఉండవచ్చు. కాబట్టి మీ రాష్ట్రానికి సంబంధించిన పూర్తి జాబితాను ఒకసారి పరిశీలించండి.
ఫుల్ లిస్ట్ ఇదే..
ప్రతి నెలలో మాదిరిగానే ఈ నెలలో కూడా రెండవ, నాల్గవ శనివారాలు అలాగే అన్ని ఆదివారాల్లో దేశవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఈ వీకెండ్ సెలవుల జాబితా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుంది.
- డిసెంబర్ 07 - ఆదివారం
- డిసెంబర్ 13 - శనివారం
- డిసెంబర్ 14 - ఆదివారం
- డిసెంబర్ 21 - ఆదివారం
- డిసెంబర్ 27 - శనివారం
- డిసెంబర్ 28 - ఆదివారం
ప్రాంతీయ సెలవులు (స్టేట్ వైజ్)
- డిసెంబర్ 01 న ఇటానగర్, కోహీమా ప్రాంతాల్లో సెలవు( రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం).
- డిసెంబర్ 03 న పానాజీ(గోవా)లో సెలవు ( సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్).
- డిసెంబర్ 12న షిల్లాంగ్(మేఘాలయ)లో సెలవు ( పాటోగాన్ నెంగ్మింజా సాంగ్మా వర్ధంతి).
- డిసెంబర్ 18న షిల్లాంగ్(మేఘాలయ)లో సెలవు(యుసోసోథామ్ వర్ధంతి).
- డిసెంబర్ 19న పానాజీ(గోవా)లో సెలవు (గోవా విముక్తి దినోత్సవం).
- డిసెంబర్ 20, 22 లో గ్యాంగ్టక్ (సిక్కిం)లో సెలవు( సూంగ్ / నామ్సూంగ్ ఫెస్టివల్).
- డిసెంబర్ 24 న ఐజ్వాల్, కోహీమా, షిల్లాంగ్ లో సెలవు(క్రిస్మస్).
- డిసెంబర్ 26 న క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఐజ్వాల్, కోహిమా, షిల్లాంగ్‌లో సెలవు.
- డిసెంబర్ 30న షిల్లాంగ్‌లో సెలవు(యుకియాంగ్ నంగ్బా వర్ధంతి).
- డిసెంబర్ 31న ఐజ్వాల్, ఇంఫాల్‌లో సెలవు. (న్యూ ఇయర్ ఈవ్).

సెలవుల్లో బ్యాంక్ పనులుంటే..
మీరు మీ ప్రాంతంలో బ్యాంక్ ఎప్పుడు తెరిచి ఉంటుందో తెలుసుకుని, అప్పుడే మీ పనులను పూర్తి చేసుకుంటే ఇబ్బంది ఉండదు. అయితే బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ కొన్ని బ్యాంకింగ్ సేవలను 24 గంటలూ ఉపయోగించుకోవచ్చు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ & మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) చెల్లింపులు, ఏటీఎం (ATM) సేవలు, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఫండ్ ట్రాన్స్‌ఫర్ (NEFT/RTGS) వంటి వాటికి ఎలాంటి ఆటంకం ఉండదు. అయితే చెక్ క్లియరింగ్ వంటి ఇతర కౌంటర్ సేవలు మాత్రం సెలవు రోజుల్లో అందుబాటులో ఉండవు. కాబట్టి పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు లేదా చెక్ ద్వారా చేయాల్సిన పనులు ఉంటే వాటిని సెలవుల కంటే ముందే ప్లాన్ చేసుకోండి.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications