జనవరి 2021లో బ్యాంకులు 14 రోజులు క్లోజ్ ఉండనున్నాయి! బ్యాంకులకు సెలవు రోజులు ఉంటే కస్టమర్లు ముందే జాగ్రత్తపడవలసి ఉంటుంది. సెలవు రోజులు వరుసగా ఉంటే ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తాయి. కాబట్టి ఖర్చులకు సరిపడే డబ్బులు ముందే చూసుకోవాలి. జనవరి 2021 సంక్రాంతి వంటి పర్వదినాలకు బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆయా రాష్ట్రాలను బట్టి మార్పులు ఉంటాయి.

జనవరిలో సెలవులు
1 జనవరి 2021 - శుక్రవారం- ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
2 జనవరి 2021 - శనివారం - మన్నం జయంతి, కేరళ
9 జనవరి 2021 - రెండో శనివారం
10 జనవరి 2021 - ఆదివారం
11 జనవరి 2021 - సోమవారం- మిషనరీ డే, మిజోరాం
14 జనవరి 2021 - గురువారం - మకర సంక్రాంతి, తెలుగు రాష్ట్రాలు సహా పలు రాష్ట్రాల్లో
15 జనవరి 2021 - శుక్రవారం - మగ్ బిహు/ తిరువళ్లూర్ డే/ కనుమ పండుగ, అసోం, తమిళనాడు, తెలుగు రాష్ట్రాలు
16 జనవరి 2021 - అజ్వార్ తిరునాళ్
17 జనవరి 2021 - ఆదివారం
20 జనవరి 2021 - బుధవారం - గురు గోబింద్ సింగ్ జయంతి, చండీగఢ్, హర్యానా
23 జనవరి 2021 - శనివారం - నేతాజీ జయంతి, పశ్చిమ బెంగాల్, త్రిపుర, ఒడిశా, అసోం (అలాగే, నాలుగో శనివారం కూడా)
25 జనవరి 2021 - సోమవారం - సోనమ్ లోచార్/హిమాచల్ రాష్ట్ర దినోత్సవం, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్
26 జనవరి 2021 - మంగళవారం, గణతంత్ర దినోత్సవం, దేశవ్యాప్తంగా క్లోజ్
31 జనవరి 2021 - ఆదివారం- మే-డామ్-మే-ఫీ, అసోం


Click it and Unblock the Notifications