2019కి గుడ్‌బై చెప్పే సమయం వచ్చింది. మరో నాలుగు రోజుల్లో కొత్త సంవత్సరంలోకి (2020) అడుగు అడుగు పెడుతున్నాం. ప్రస్తుత జీవితంలో అందరికీ బ్యాంకులతో పని ఏర్పడింది. అదే సమయంలో డిజిటలైజేషన్ కారణంగా బ్యాంకులకు వెళ్లే పని కొన్ని విషయాల్లో తప్పినప్పటికీ, వివిధ అవసరాల నిమిత్తం వెళ్లవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి ఆయా రోజుల్లో ఆ బ్యాంకుకు సెలవు ఉందా లేదా తెలుసుకోవడం తప్పనిసరి. సెలవు రోజు ముందే తెలుసుకుంటే దానిని బట్టి ప్లాన్ చేసుకోవడం సులభం అవుతుంది.

కొన్ని ఫిక్స్‌డ్ రోజులు...
సెలవు రోజుల గురించి ఏమీ తెలియకుండా మనం తీరా బ్యాంకుకు వెళ్లాక అది క్లోజ్ అయి ఉంటే ఈ సమయం మరో పనికి కేటాయించేవాళ్లం కదా అనుకునే సందర్భాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి సెలవు రోజులు ముందే తెలుసుకోవడం మంచిది. బ్యాంకు సెలవులు ఆయా రాష్ట్రాల పండుగలను బట్టి కూడా మారుతుంటాయి. కొన్ని కామన్ సెలవులు ఉంటాయి. ఆర్బీఐ బ్యాంకింగ్ కార్యకలాపాల మూసివేతకు కొన్ని ఫిక్స్డ్ డేస్ నిర్ణయించింది.

ఇవి తప్పనిసరి...
రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే, గాంధీ జయంతి వంటి వాటికి అన్ని బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అలాగే, ఇవి కాకుండా ఆయా ప్రాంతాల్లో పండుగలు, ముఖ్యమైన ఇతర దినాల ఆధారంగా సెలవులు ఉంటాయి. ఉదాహరణకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతి, దసరా వంటివి. అసోంలో బిను, కేరళలో ఓనం పండుగకు సెలవు ఉంటుంది. ఇవి కాకుండా ఆదివారాలు, ఆయా నెలల్లోని రెండు, నాలుగు శనివారాల్లో బ్యాంకులు పని చేయవు.

2020లో సెలవు రోజులు ఇవే...
1 జనవరి 2020 బుధవారం, కొత్త సంవత్సరం
15 జనవరి 2020 బుధవారం, సంక్రాంతి (దక్షిణ భారతదేశం)
26 జనవరి 2020 ఆదివారం, గణతంత్ర దినోత్సవం
30 జనవరి 2020 గురువారం, వసంత పంచమి
21 ఫిబ్రవరి 2020 శుక్రవారం, మహా శివరాత్రి
10 మార్చి 2020 మంగళవారం, హోలి
25 మార్చి 2020 బుధవారం, ఉగాది
2 ఏప్రిల్ 2020 గురువారం, రామనవమి
6 ఏప్రిల్ 2020 సోమవారం, మహావీర జయంతి
10 ఏప్రిల్ 2020 శుక్రవారం, గుడ్ ఫ్రైడే
14 ఏప్రిల్ 2020 మంగళవారం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి
1 మే 2020 శుక్రవారం, మే డే
7 మే 2020 గురువారం, బుద్ధ పూర్ణిమ
31 జూలై 2020 శుక్రవారం, బక్రీద్/ఈద్-అల్-అదా
3 ఆగస్ట్ 2020 సోమవారం, రక్షా బందన్
11 ఆగస్ట్ 2020 మంగళవారం, శ్రీకృష్ణ జన్మాష్టమి
30 ఆగస్ట్ 2020 ఆదివారం, మొహర్రమ్
2 అక్టోబర్ 2020 శుక్రవారం, గాంధీ జయంతి
26 అక్టోబర్ 2020 సోమవారం, విజయ దశమి
30 అక్టోబర్ 2020 శుక్రవారం, ఈద్ ఈ మిలాద్
14 నవంబర్ 2020 శనివారం, దీపావళి
16 నవంబర్ 2020 సోమవారం, భాయి దూజ్
30 నవంబర్ 2020 సోమవారం, గురునానక్ జయంతి
25 డిసెంబర్ 2020 శుక్రవారం, క్రిస్మస్


Click it and Unblock the Notifications