మీకు బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని ఉంటే ఈరోజే పూర్తి చేసుకోండి. ఎందుకంటే రేపు అంటే ఏప్రిల్ 18న దేశంలోని చాలా నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. కానీ శనివారం మాత్రం బ్యాంకులు తెరిచి ఉంటాయి. అంతేకాదు ఈ ఆదివారం వీకెండ్ కాబట్టి ఎప్పటిలాగే అన్ని బ్యాంకులకు సెలవు ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ హాలిడేస్ ప్రకారం, ప్రతి నెలా రెండవ ఇంకా నాల్గవ శనివారాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. హాలీడేస్'కి సంబంధించి ప్రతి నెల రెండవ, నాల్గవ కాకుండా అన్ని శనివారాలు కూడా వీకండ్ సెలవుగా ప్రకటించాలని బ్యాంకు ఉద్యోగులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు.

రేపు బ్యాంకులు ఎందుకు బంద్ అంటే : దేశంలోని కొన్ని రాష్ట్రాలు మినహా గుడ్ ఫ్రైడే సందర్భంగా చాలా రాష్ట్రాల్లో రేపు అంటే ఏప్రిల్ 18 శుక్రవారం బ్యాంకులు మూసివేయబడతాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, త్రిపుర, అస్సాం, రాజస్థాన్, జమ్మూ, హిమాచల్ ప్రదేశ్, శ్రీనగర్ మినహా అన్ని రాష్ట్రాల్లో శుక్రవారం బ్యాంకింగ్ సెలవలు ఉండవు. ఇలాంటి సమయంలో మీకు ఏదైనా ముఖ్యమైన బ్యాంక్ సంబంధిత పని ఉంటే ఈరోజు పూర్తి చేసుకోవడం మంచిది.
ఎప్పటిలాగే ఈ సౌకర్యాలు అందుబాటులో : ఏప్రిల్ 18న బ్యాంకులకు ఆర్బీఐ సెలవు కారణంగా మూసివేయబడతాయి, కానీ డిజిటల్ సేవలు యధావిధిగా పనిచేస్తూనే ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్ ఇంకా ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవల సహాయంతో కస్టమర్లు సులభంగా మని ట్రాన్సక్షన్ చేసుకోవచ్చు. మని ట్రాన్స్ఫర్ కాకుండా బిల్ పేమెంట్స్, ఎఫ్‌డి అకౌంట్ ఓపెనింగ్ ఇంకా లోన్ అప్లికేషన వంటి సేవలు ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా కొనసాగుతాయి.
ఏప్రిల్ 2025లో బ్యాంకు హాలిడేస్ లిస్ట్:
ఏప్రిల్ 20 (ఆదివారం): ఈస్టర్ - దేశవ్యాప్తంగా సెలవు.ఏప్రిల్ 26 (శనివారం): నాల్గవ శనివారం - భారతదేశం అంతటా బ్యాంకులు మూసివేయబడతాయి.
గరియా పూజ - ఏప్రిల్ 21 (సోమవారం) త్రిపురలో బ్యాంకులు బంద్.
ఏప్రిల్ 27 (ఆదివారం): ఆదివారం సాధారణ సెలవు.
ఏప్రిల్ 29 (మంగళవారం) - భగవాన్ శ్రీ పరశురామ జయంతి సందర్భంగా హిమాచల్ ప్రదేశ్‌లో బ్యాంకులు బంద్, ఇంకా ఈ రోజున విష్ణువు ఆరవ అవతారమైన పరశురాముడి జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు.
ఏప్రిల్ 30 (బుధవారం) - బసవ జయంతి సందర్భంగా కర్ణాటకలో బ్యాంకులు మూసివేయబడతాయి.
అయితే ఆర్బీఐ హాలిడేస్ క్యాలెండర్ ప్రకారం ప్రాంతీయ పండుగల బట్టి రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు హాలిడేస్ మారుతుంటాయి.
గుడ్ ఫ్రైడే : గుడ్ ఫ్రైడే అనేది క్రైస్తవ మతానికి చెందిన ముఖ్యమైన పండుగ, దీనిని ప్రతి సంవత్సరం ఈస్టర్ ఆదివారం ముందు శుక్రవారం జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడేను 'హోలీ ఫ్రైడే' ఇంకా 'గ్రేట్ ఫ్రైడే' అని కూడా పిలుస్తారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!



Click it and Unblock the Notifications