రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) మన దేశంలో బ్యాంకు సెలవులను మూడు విభాగాలుగా వర్గీకరిస్తుంది. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ హాలీడే, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలీడే, బ్యాంకు క్లోజింగ్ హాలీడే ఉంటాయి. నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద పండుగ సెలవులు వస్తాయి. ఆగస్ట్ నెలలో ఆదివారాలు, రెండు, నాలుగో శనివారంతో పాటు పండుగల రోజులు సెలవులు ఉంటాయి.

ఈ రోజుల్లో సెలవు దినం
ఆగస్ట్ నెలలో మొదటి బ్యాంకు సెలవు రోజు ఆగస్ట్ 1వ తేదీన ప్రారంభం అవుతుంది. ప్రతి ఆదివారం బ్యాంకులకు సెలవు దినం. అలాగే రెండో శనివారం, నాలుగో శనివారం కూడా సెలవు ఉంటుంది. ఆగస్ట్ నెలలో మొత్తం 8 సెలవు దినాలు ఉన్నాయి. 2021 ఆగస్ట్ 15వ తేదీ ఆదివారం వస్తుంది. అలాగే ఆ రోజు స్వాతంత్ర దినోత్సవం కూడా.
ఆగస్ట్ 16న పార్సీ కొత్త సంవత్సరం సందర్భంగా సెలవు దినం. ఈ రోజు బెలాపూర్, ముంబై, నాగపూర్‌లలో బ్యాంకులు మూసి ఉంటాయి. ఆగస్ట్ 19వ తేదీన అగర్తాల, అహ్మదాబాద్, బేలాపూర్, భోపాల్, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, నాగపూర్, న్యూఢిల్లీ, పాట్నా, రాయపూర్, రాంచీ, శ్రీనగర్ ప్రాంతాల్లో మొహర్రం సందర్భంగా సెలవు.

హైదరాబాద్‌లో ఆ రోజు సెలవు
ఆగస్ట్ 20వ తేదీన బెంగళూరు, చెన్నై, కోచ్చి, కేరళలో మొహర్రం, ఓనమ్ సందర్భంగా సెలవు రోజు. ఆగస్ట్ 21న తిరువోనం సందర్భంగా కేరళ, కొచ్చిలో బ్యాంకులు మూసివేసి ఉంటాయి. ఆగస్ట్ 23వ తేదీన శ్రీ నారాయణ గురు జయంతి సందర్భంగా కోచ్చి, తిరువనంతపురంలో సెలవు ఉంటుంది. ఆగస్ట్ 28వ తేదీ నాలుగో శనివారం కాబట్టి సెలవు రోజు. ఆగస్ట్ 29 ఆదివారం.
ఆగస్ట్ 30వ తేదీన జన్మాష్టమి సందర్భంగా చండీగఢ్, చెన్నై, డెహ్రాడూన్, గ్యాంగ్‌టక్, జైపూర్, జమ్మూ, కాన్పూర్, లక్నో, పాట్నా, రాయపూర్, రాంచీ, షిల్లాంగ్, సిమ్లా, శ్రీనగర్ ప్రాంతాల్లో బ్యాంకులకు సెలవు. ఆగస్ట్ 30వ తేదీన శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా హైదరాబాద్‌లో సెలవు.

సెలవులు
బ్యాంకులకు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సెలవు ఉంటుంది. పండుగల సమయంలోను బ్యాంకులు మూసివేసి ఉంటాయి.
స్వాతంత్ర దినోత్సవం ఆగస్ట్ 13, 2021, శుక్రవారం,
పార్సీ కొత్త ఏడాది (షహెన్షాయ్) ఆగస్ట్ 16, 2021 సోమవారం,
మొహర్రం (అశూర) ఆగస్ట్ 19, 2021 గురువారం,
మొగక్కం/ఫస్ట్ ఓనమ్ ఆగస్ట్ 20, 2021 శుక్రవారం,
తిరువోనమ్ ఆగస్ట్ 21, 2021 శనివారం,
శ్రీ నారాయణ గురు జయంతి ఆగస్ట్ 23, 2021 సోమవారం,
జన్మాష్టమి (Shravan Vad-8)/కృష్ణ జయంతి ఆగస్ట్ 30, 2021 సోమవారం,
శ్రీకృష్ణాష్టమి ఆగస్ట్ 31, 2021 మంగళవారం.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications