బ్యాంకుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ తొమ్మిది ప్రధాన ఉద్యోగ సంఘాలు ఈ నెల 15వ తేదీ, 16వ తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో రెండు రోజుల పాటు సాధారణ బ్యాంకు కార్యకలాపాలకు ఆటంకం కలిగే అవకాశం ఉందని స్టాక్ ఎక్స్చేంజీలకు ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది. బ్యాంకుల ప్రయివేటీకరణ నిర్ణయంతో పాటు తిరోగమన బాటలో ఉన్న బ్యాంకింగ్ సంస్కరణలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి.
బ్యాంకు శాఖల్లో కార్యకలాపాలు కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్బీఐ తెలిపింది. తొమ్మిది ప్రధాన సంఘాలకు ప్రాతినిథ్యం వహిస్తున్న యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) ఇటీవల రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో ఈ రెండు రోజులు తమ సేవలకు విఘాతం కలగవచ్చని ఎస్బీఐ వెల్లడించింది. సమ్మె సందర్భంగా అన్ని శాఖలు యథాతథంగా పని చేసేలా ఏర్పాట్లు చేశామని, అయినా వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం ఉండవచ్చునని తెలిపింది. సమ్మె వల్ల ఎంత నష్టం ఉంటుందో అప్పుడే చెప్పలేమని వెల్లడించింది.

కాగా, బ్యాంకులకు ఈ నెలలో సెలవులు ఉన్నాయి. వచ్చే వారం పది రోజుల్లో బ్యాంకులు ఎక్కువ రోజులు మూసివేసి ఉండనున్నాయి. గురువారం మార్చి 11 శివరాత్రి సందర్భంగా బ్యాంకులు పని చేయవు. శుక్రవారం మార్చి 12, 2021 ఒకరోజు బ్యాంకులు పని చేస్తాయి. ఆ తర్వాత శనివారం మార్చి 13, ఆదివారం మార్చి 14 రెండు రోజులు సెలవు. రెండో శనివారం కారణంగా బ్యాంకులు బంద్ ఉంటాయి. ఆదివారం బ్యాంకులు పని చేయవు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications