బ్యాంకు ఉద్యోగులకు గుడ్‌న్యూస్...ఇకనుంచి వారికి ఐదురోజుల పనిదినాలు మాత్రమే వర్తించనున్నాయి. బ్యాంకు ఉద్యోగుల సుదీర్ఘ డిమాండ్ అయిన ఐదు రోజుల పనిదినాల కల ఈ సంవత్సరం నెరవేరబోతుంది. దాంతోపాటే వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ డిమాండ్‌కు ఇక ఆర్థిక మంత్రిత్వశాఖ నుంచి ఆమోదం మాత్రమే రావాల్సి ఉంది. ఈ ఏడాది జూన్ నెల నుంచే ఈ ఐదు రోజుల పనిదినాల విధానం అమల్లోకి రానుంది.
బ్యాంకింగ్ రంగంలో వారానికి ఐదు రోజుల పనిదినాలు మాత్రమే అమలు చేయాలంటూ బ్యాంకు ఉద్యోగులతో కూడిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌కు గతంలో ఓ లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఐదు రోజుల పని వల్ల బ్యాంక్ ఖాతాదారులకు సేవలు అందించే పని గంటలు ఏమాత్రం తగ్గిపోవని, అలాగే ఉద్యోగులు, అధికారుల మొత్తం పనిగంటల్లోనూ ఎలాంటి మార్పులు ఉండవని అందులో హామీ ఇవ్వడం జరిగింది.

వారంలో ఐదురోజుల పనిదినాలు ఇప్పటికే ఇప్పటికే ఆర్‌బిఐ, ఎల్ఐసీ సంస్థల్లో అమల్లో ఉన్నాయి. కాబట్టి ఈ విషయాన్ని సమీక్షించి తమకు అనుకూలంగా ఇండియన్ బ్యాంక్స్ అసోసియషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని బ్యాంక్ ఎంప్లాయిస్ యూనియన్ కోరింది.
రెండు రోజుల సెలవుతో పాటు వేతనపెంపు...
వారంలో ఐదురోజులు మాత్రమే బ్యాంక్ ఉద్యోగులు పనిదినాలు కల్పించాలనే డిమాండ్ ఇప్పటిది కాదు. ఇది 2015 నుంచి వున్నదే. ప్రస్తుతం నెలలో ప్రతి రెండు, నాలుగో శనివారం బ్యాంకులు సెలవు పాటిస్తున్న సంగతి తెలిసిందే. గత సంవత్సరం ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఉద్యోగులకు 17 శాతం వేతనం పెరిగింది.
కేంద్రప్రభుత్వం గనుక అమోదం తెలిపితే ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకు రంగంలో 3.8 లక్షలమంది అధికారులు సహా తొమ్మిది లక్షలమంది బ్యాంకు ఉద్యోగులకు వారానికి రెండు రోజుల వీక్లీ ఆఫ్ లభించనుంది, వీటితోపాటు వేతనపెంపు కూడా వర్తించనుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులన్నింటికీ వర్తిస్తుంది.
More From GoodReturns

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?



Click it and Unblock the Notifications