Bank holidays: బ్యాంకుల పనిదినాల్లో కీలక మార్పు.. ఉద్యోగులకు ఇక పండగే.. కానీ..
Bank holidays: బ్యాంకు ఉద్యోగులు త్వరలోనే శుభవార్తను విననున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. IT ఎంప్లాయీస్ మాదిరిగా వారి పని దినాల్లో మార్పులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ సైతం ఏ మాత్రం అభ్యంతరం చెప్పకపోవడంతో దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
ఇకపై బ్యాంకులు వారానికి 5 రోజులే పనిచేయనున్నాయి. ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (IBA) మరియు యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) మధ్య శుక్రవారం సమావేశం జరగనుంది. ఆ మీటింగ్‌లో ఈ అంశం చర్చకు రానుంది. తద్వారా ఈ దీర్ఘకాలిక డిమాండ్ పై ఓ నిర్ణయం వెలువడవచ్చని భావిస్తున్నారు.

వారానికి 5 పని దినాలకు సంబంధించిన అంశం వాటాదారుల యాక్టివ్ పరిశీలనలో ఉందని ఇటీవల UFBU తెలిపింది. అతి త్వరలో దీన్ని ప్రవేశపెట్టేలా ప్రక్రియను వేగవంతం చేయాలని IBAను కోరినట్లు పేర్కొంది. అయితే రెండు రోజులు వీక్లీ ఆఫ్ ఉన్నప్పటికీ, రోజూ 40 నిమిషాల పాటు ఎక్కువ సమయం బ్యాంకులు తెరిచే ఉంటాయని వెల్లడించింది.
ప్రస్తుతం బ్యాంకు ఉద్యోగులు ఆదివారాలు సహా రెండు, నాలుగు శనివారాలు సెలవులు తీసుకుంటున్నారు. అయితే మే 2021లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఆఫ్ ఇండియాలో 5 రోజుల పని పాలసీని అమలు చేశారు. ఆ తర్వాత బ్యాంకింగ్ సిబ్బంది సైతం ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. శుక్రవారం దీనిపై ఓ ప్రకటన వెలువడవచ్చని భావిస్తున్నారు. దీనితో పాటు జీతం పెంపు, రిటైర్డ్ సిబ్బందికి గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ పైనా సమావేశంలో చర్చించనున్నారు.


Click it and Unblock the Notifications