బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు ఏప్రిల్ నెలలో పన్నెండు రోజుల వరకు మూతబడుతున్నాయి. 2021-22 ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్. ఈ నెలలో పర్వదినాలు, ప్రముఖుల జయంతులు, ఇతర సెలవులు ఉంటాయి. మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ మధ్య కాలంలో రెండు రోజులు మాత్రమే బ్యాంకులు పని చేస్తున్నాయి. అలాగే ఈ నెలలోను 27వ తేదీ నుండి 29 తేదీ మధ్య వరుసగా మూడు రోజులు పని చేయవు.

ఏప్రిల్‌లో బ్యాంకు సెలవులు
ఏప్రిల్ 1వ తేదీ వార్షిక ఖాతాల మూసివేత, ఏప్రిల్ 2వ తేదీ గుడ్ ఫ్రైడే, ప్రిల్ 4వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 5వ తేదీ బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, ఏప్రిల్ 10వ తేదీ రెండో శనివారం, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 13వ తేదీ ఉగాది పర్వదినం, ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి, ఏప్రిల్ 18వ తేదీ ఆదివారం, ఏప్రిల్ 21వ తేదీ శ్రీరామ నవమి, ఏప్రిల్ 24వ తేదీ నాలుగో శనివారం, ఏప్రిల్ 25వ తేదీ ఆదివారం. ఈ రోజుల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. అయితే ఆయా పండుగ రోజులు, ఆయా రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల పండుగలను బట్టి సెలవులు కూడా ఉంటాయి.

షేర్ మార్కెట్ క్లోజ్
గుడ్ ఫ్రైడే సందర్భంగా నేడు (మార్చి 2) స్టాక్ మార్కెట్లు తెరుచుకోలేదు. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ శని, ఆదివారాలు పని చేయవు. అలాగే, మరికొన్ని సెలవులు కూడా ఉన్నాయి. ఈ నెలలో షేర్ మార్కెట్ 11 రోజులు తెరుచుకోంది. ఏప్రిల్ 2న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి, ఏప్రిల్ 21న శ్రీరామనవమి పర్వదినం ఉంది. ఇవి కాకుండా శనివారం, ఆదివారం నేపథ్యంలో ఏప్రిల్ 3, ఏప్రిల్ 4, ఏప్రిల్ 10, ఏప్రిల్ 11, ఏప్రిల్ 17, ఏప్రిల్ 18, ఏప్రిల్ 24, ఏప్రిల్ 25వ తేదీలు తెరుచుకోవు.

మహావీర్ జయంతి... ఆదివారం
మహావీర్ జయంతి రోజు కూడా షేర్ మార్కెట్ తెరుచుకోంది. అయితే ఈసారి మహావీర్ జయంతి ఆదివారం (ఏప్రిల్ 25) వస్తోంది. బీఎస్ఈ సెన్సెక్స్ ఉదయం గం.9.15కు ప్రారంభమై, మధ్యాహ్నం గం.3.30కి ముగుస్తుంది. ఎన్ఎస్ఈ ఉదయం గం.9.15కు ప్రారంభమై, మధ్యాహ్నం గం.3.30కి ముగుస్తుంది.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications