Bangladesh News: బంగ్లాదేశ్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభం సెగలు భారత్‌ను తాకాయి. ఆ దేశంతో ఇండియాకు పెద్ద ఎత్తున వాణిజ్య, ఆర్థిక సంబంధాలు ఉండటంతో ఆయా వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. కొన్ని దేశీయ లిస్టెడ్ కంపెనీల ఆదాయాల్లో బంగ్లా వాటా సగానికిపైగా ఉండటం ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తోంది.
FMCG కంపెనీ మారికో లిమిటెడ్ షేర్లు రెండో రోజు కూడా 4 శాతానికి పైగా పతనమయ్యాయి. 642 కనిష్ఠ స్థాయికి చేరాయి. ఎందుకంటే మారికో అంతర్జాతీయ వ్యాపార ఆదాయంలో సింహభాగం బంగ్లాదేశ్ నుంచి వస్తోంది. 12 శాతానికి పైగా బంగ్లా మార్కెట్ సహకారం అందిస్తోంది. అక్కడి ప్రతి 5 కుటుంబాల్లో 4 తమ ఉత్పత్తులను వినియోగిస్తాయని కంపెనీ గతంలో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ స్టాక్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

బంగ్లా సంక్షోభం వల్ల గుజరాత్ కు చెందిన పలు పరిశ్రమలు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. అక్కడి ప్రపంచ స్థాయి వస్త్ర పరిశ్రమకు అవసరమైన డైస్, రసాయనాలు వంటి దాదాపు వెయ్యి కోట్లు విలువైన ఉత్పత్తులు ప్రతినెలా గుజరాత్ నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతి అవుతున్నాయి. అక్కడ అత్యవసర పరిస్థితి తలెత్తడంతో ఈ చెల్లింపులు నిలిచిపోయే ప్రమాదం లేకపోలేదు. గణాంకాల ప్రకారం 2023-24లో బంగ్లాదేశ్‌కు భారత్ నుంచి 5 వేల కోట్ల విలువైన రసాయనాలు ఎగుమతి చేయబడ్డాయి.
రాజకీయ సంక్షోభం తలెత్తడంతో ఓడరేవులో సరుకుల అన్‌లోడ్ కూడా నిలిచిపోయింది. గుజరాత్ నుంచి బంగ్లాదేశ్‌కు ఎగుమతి కాబడిన పత్తి, నూలు మరియు పాలిస్టర్‌లు దిగుమతుల్లో అంతరాయం ఏర్పడింది. మీడియా నివేదికల ప్రకారం అక్కడ 3 వేల కంటే ఎక్కువ టెక్స్‌టైల్ మిల్లులు మూతబడ్డాయి. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగితే, యూరోపియన్ మరియు అమెరికా మార్కెట్ల నుంచి బంగ్లాకు పోటీదారుగా ఉన్న భారత్‌కు ఆ ఆర్డర్లు మళ్లే అవకాశం ఉందని వ్యాపారవేత్తలు భావిస్తున్నారు.
'భారత్‌లో కాలుష్యం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు సంబంధించి కఠిన నిబంధనలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఈ నిబంధనలను పాటించదు కాబట్టి తిరుపూర్‌లో తయారయ్యే వస్త్రాలు బంగ్లాదేశ్ ఉత్పత్తులతో పోలిస్తే దాదాపు 25 శాతం ఖరీదైనవి. దీంతో వివిధ దేశాల వ్యాపారులు బంగ్లాదేశ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంక్షోభం ప్రభావం ఆ దేశంతో వ్యాపార సంబంధాలు కలిగిన ఇతర దేశాలపై కూడా ఉంటుంది' అని తిరుపూర్ ఎగుమతిదారుల సంఘం అధ్యక్షులు ముత్తురథినం అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

బంగారం ధరలు పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల చూస్తే పసిడి జోలికే పోరు.. మార్చి 17, మంగళవారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..



Click it and Unblock the Notifications