కొన్ని నెలల క్రితం బంగ్లాదేశ్‌లో దేశవ్యాప్తంగా ఆందోళనలు, అల్లర్లు జరిగిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా రద్దుకు వ్యతిరేకంగా ఆ దేశంలో విద్యార్థులు భారీ ఏత్తున ఆందోళనలు చేపట్టారు. వాటిని అరికట్టేందుకు హసీనా ప్రభుత్వం అప్పట్లో రకరకాల ప్రయత్నాలు చేసింది. ఆ సమయంలోనే ఆమెపై కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల విచారణ ఇప్పటికి పూర్తయింది. ఆమెను దోషిగా తేలుస్తూ ఏకంగా ఉరిశిక్షను ఖరారు చేసింది కోర్టు.
ఈ మూడు ఆరోపణల్లో..
కోర్టు ఆమెను మూడు ఆరోపణల్లో దోషిగా తేల్చింది. విద్యార్థుల తిరుగుబాటులో జరిగిన దాడులను అరికట్టడంలో హసీనా వైఫల్యం చెందారని కోర్టు పేర్కొంది. ఆ సమయంలో హింసకు ప్రేరేపించడం, నిరసనకారులను చంపేందుకు ఆదేశాలు ఇవ్వడం, నిరసనకారులను కట్టడి చేయడానికి ప్రాణాంతక ఆయుధాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు వాడమని ఆమె ఆదేశాలు ఇవ్వడాన్ని కోర్టు నేరాలుగా పరిగణించి ఈ తీర్పుని వెల్లడించింది.

ఖండిచిన హసీనా
అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ విధించిన మరణశిక్ష తీర్పును హసీనా తీవ్రంగా ఖండించారు. ఇది రిగ్గింగ్ ట్రిబ్యునల్ పని అని.. ప్రజాస్వామ్య అధికారం లేని తాత్కాలిక ప్రభుత్వం పన్నిన కుట్ర అని ఆమె ధ్వజమెత్తారు. బంగ్లాదేశ్ లోని కొన్ని శక్తుల ప్రేరేపణ వల్ల ఉద్దేశపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించింది. "నాపై దోషి అన్న ముద్ర ముందుగానే నిర్ణయించబడిందని, ప్రపంచంలోని ఏ న్యాయవాది బంగ్లాదేశ్ క్రిమినల్ ట్రిబ్యునల్ తీర్పుని సమర్థించరని ఆమె నోట్ ద్వారా తెలిపింది. ఇంకా అందులో.. "మహమ్మద్ యూనస్ నాయకత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం న్యాయవ్యవస్థను ఆయుధంగా వాడుతోంద"ని ఆరోపించింది. యూనస్ పాలనలో బంగ్లాదేశ్ అస్తవ్యస్తంగా, హింసాత్మకంగా మారిందని చెప్పుకొచ్చింది. మైనారిటీలపై దాడులు, అణచివేత వంటివి జరుగుతున్నాయని ఆమె పేర్కొంది.
అవకాశం ఇవ్వలేదు
ఇకపోతే తనపై వచ్చిన ఆరోపణలు సమర్థించుకునేందుకు ఆమెకు అవకాశం ఇవ్వలేదని హసీనా వాదిస్తున్నారు. తన తరఫున న్యాయవాదులను నియమించుకోడానికి, సాక్ష్యాలు సమర్పించడానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఆమె అంటోంది. ఈ కేసును బంగ్లాదేశ్ కోర్టు నుంచి అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు తీసుకెళ్లాలని ఆమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని సవాలు చేస్తోంది. "సరైన న్యాయస్థానంలో సాక్ష్యాలను పరిశీలించినట్లయితే, నాపై ఆరోపణలు రుజువు కావు" అని ఆమె అన్నారు.
భారత్ లోనే ఆశ్రయం
బంగ్లాదేశ్ అల్లర్ల తర్వాత హసీనా దేశం విడిచి వెళ్లిపోయింది. ఆమెను ప్రధాని పదవి నుంచి ఆగస్టు 5, 2024న తొలగించారు. అప్పట్నుంచి ఆమె భారత్‌లోనే ఆశ్రయం పొందుతున్నారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యూనస్ ఉన్నారు. యూనస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా బంగ్లాదేశ్ లో పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పుడు హీసీనా ఉరిశిక్ష నిర్ణయం తర్వాత పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications