మండిపోతున్న బెంగళూరులో అద్దెలు: న్యూయార్క్‌తో పోలిస్తే దిమ్మతిరిగే నిజాలు!

ఒకప్పుడు ముంబై తరువాత అభివృద్ధి చెందుతున్న నగరంగా ఉన్న బెంగుళూరు తరువాత ఐటీకి కేంద్రంగా మారింది. దింతో టెక్కీలకు అనువైన ప్రదేశంగా కావడమే కాకుండా నేడు అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా పెరిగిపోయింది. దీనికి ఒక మంచి ఉదాహరణ బెంగుళూరు అద్దెలు(rents). ఎందుకంటే బెంగళూరులో ప్రస్తుతం జీవన వ్యయం(cost of living) విపరీతంగా పెరిగిపోతోంది.

Bangalore rents skyrocketing while compared to New York professionals experts were shocking these hikes

హైదరాబాద్‌కు చెందిన ఫైనాన్షియల్ అనలిస్ట్ హార్దిక్ జోషి లింక్డ్‌ఇన్‌లో ఈ విషయాన్నీ పోల్చి చూపెడుతూ ఆశ్చర్యపరిచారు. బెంగళూరులోని కోరమంగళలో 2BHK అపార్ట్‌మెంట్ అద్దె నెలకు రూ.70 వేలు ఖర్చవుతుందని అన్నారు. అంటే ఈ రెంట్ న్యూయార్క్ శివారులోని ఇలాంటి అపార్ట్‌మెంట్ కంటే కేవలం రూ. 10 వేలు తక్కువ. ఈ విషయం వెల్లడైన తర్వాత, ఒకప్పుడు నిపుణులకు చౌక నగరంగా ఉన్న బెంగళూరు నేడు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాలతో ఎలా పోటీ పడుతోందో చుపిస్తుంది. డిమాండ్ ఇంకా సప్లయ్ మధ్య పెరుగుతున్న అంతరాయం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తింది. ప్రతి సంవత్సరం వేలాది మంది ఎంతో మంది బెంగళూరుకు వస్తుంటారు. కానీ, ఇళ్ల సంఖ్య అందుకు తగ్గట్టుగా వేగంగా పెరగడం లేదు.

బెంగళూరులో ఇంటి అద్దెలు వేగంగా పెరుగుతుండటం పై హార్దిక్ జోషి ఈ పరిస్థితిని అవాక్కయ్యేలా అభివర్ణించారు. నగరంలోకి వచ్చే ప్రజల సంఖ్యకు తగ్గట్టుగా కొత్త ఇళ్లు నిర్మించడం లేదని ఆయన అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో భూస్వాములు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రెంట్లు పెంచుతున్నారు. ప్రజలు ఈ రెంట్లు కట్టే అవకాశం లేకుండా నగరం వదిలి వెళ్ళే ఛాన్స్ ఏర్పడుతుంది.

కనీస సౌకర్యాలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు: అద్దెతో పాటు నగరంలోని కనీస సౌకర్యాలు కూడా ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ట్రాఫిక్ జామ్‌లు అలాగే ప్రజా రవాణా సరిగా లేకపోవడం వల్ల నిత్య జీవితం కష్టతరం అయింది. వీటికి తోడు వేసవిలో నీటి సామాన్య కూడా. హార్దిక్ జోషి సింపుల్'గా చెప్పాలంటే 'మీరు న్యూయార్క్ రెంట్లు చెల్లిస్తున్నారు, కానీ మీరు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి ఒక గంట సమయం పట్టే నగరంలో ఉంటున్నారని గమనించాలి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ఉత్తర బెంగళూరులో ముఖ్యంగా హెబ్బల్, హెన్నూర్ అండ్ థానిసంద్రలో అద్దెలు 20-25% పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతాలు విమానాశ్రయానికి దగ్గరగా ఉన్నాయి, ఇక్కడ అనేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి.

Take a Poll

అద్దె ఎక్కడ పెరుగుతుందని భావిస్తున్నారు: వైట్‌ఫీల్డ్ శివార్లలోని గ్లెన్‌వుడ్ లేఅవుట్ అండ్ వర్తూర్ రోడ్ వంటి ప్రదేశాల్లో ఇప్పటికీ టెక్ నిపుణులకు ఇష్టమైన గమ్యస్థానాలుగా ఉన్నాయి. ఇక్కడ రెంట్లు 10-20% పెరిగే అవకాశం ఉంది. సర్జాపుర రోడ్డులో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఈ ప్రాంతం ఐటీ కేంద్రాలకు బాగా అనుసంధానించి ఉన్నాయి. కనకపుర రోడ్డులో కొత్త మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కారణంగా డిమాండ్ కూడా పెరుగుతోంది. దశాబ్దం క్రితం బెంగళూరు అవకాశాల నగరంగా ఉండేది. చాలా చౌకగా, డైనమిక్‌గా ఇంకా ఆశాజనకంగా ఉండేది. కానీ, ఇప్పుడు భారతదేశంలో అత్యంత ఖరీదైన నగరంగా మారిందా అని చాలామంది అవాక్కవుతున్నారు. ఈ కారణంగా, నిపుణులు ఇప్పుడు ఇతర అప్షన్స్ కోసం పరిశీలిస్తున్నారు. బెంగళూరులో జీవన వ్యయం పెరగడం వల్ల ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కొంటున్నారు. అద్దె ధరలు ఆకాశాన్నంటుతుండటంతో కనీస సౌకర్యాలు కూడా ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది నగరం వదిలి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+