బెంగుళూరులో దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన భూమి అమ్మకం ఇప్పుడు నగరంలో వివాదం రేపుతోంది. 2006లో కూతురు పెళ్లి కోసం తండ్రి భూమిని అమ్మగా నా పర్మిషన్ లేకుండా మా తండ్రి అమ్మారు..ఇప్పుడు నాకు నష్టపరిహారం ఇవ్వాలంటూ కొనుగోలు దారుపై కూతురు బెదిరింపులకు దిగింది. ఈ మేరకు తండ్రి వద్ద నుంచి భూమిని కొన్న యజమానికి లీగల్ నోటీసును పంపించింది. ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అనేక ప్రశ్నలను రేకెత్తిస్తోంది.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (BBMP) పరిధిలో ఉన్న ఆ ఆస్తిని 2006లో ఇప్పుడు పరిహారం కోరుతున్న మహిళ తండ్రి ఓ వ్యక్తికి విక్రయించాడు. తాజాగా ఆమె లీగల్ నోటీసు పంపడంతో కొనుగోలుదారుడు రెడ్డిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్నాడు. అతని పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. భూమి అసలు విక్రేత నేరుగా 2006లో అమ్మకాన్ని పూర్తి చేశాడు. పవర్ ఆఫ్ అటార్నీ (POA) లేకుండా నేరుగా కొనుగోలుదారునికి ఈ భూమిని అమ్మాడు. ఇందులో అది అవసరంలేదని కూడా కొనుగోలు సమయంలో తెలిపాడు. భూమిని కొన్న కొనుగోలు దారు అప్పటి నుండి ఏ ఏడాది మిస్ కాకుండా ఆస్తి పన్ను కూడా చెల్లిస్తూ వస్తున్నాడు. చట్టపరంగా అన్ని చర్యలు భూమి అమ్మకం సమయంలో జరిగాయి.

ఇప్పుడు.. 19 సంవత్సరాల తరువాత.. విక్రేత కుమార్తె ఈ భూమిని కొన్న వారి వద్ద నుంచి పరిహారం కోరుతోంది. ఈ భూమి అమ్మకానికి ముందు నన్ను అడగలేదు లేదా నాకు సమాచారం ఇవ్వలేదని చెబుతోంది. ఆ సమయంలో ఆమె మైనర్ అయినప్పటికీ ఇప్పుడు మేజర్ అయ్యాక ఆమె పరిహారం అడగడం చాలా మందిని గందరగోళానికి గురిచేస్తోంది. భూమి కొనుగోలుదారుల ప్రకారం, విక్రేత స్వయంగా తన కుమార్తె వివాహ ఏర్పాట్ల కోసం భూమిని అమ్మేశానని చెప్పాడు. ఇంత తెలిసి అమ్మకంలో, చాలా సంవత్సరాల తర్వాత కుమార్తె క్లెయిమ్ చేసుకోవడం వింతగా కనిపిస్తుంది. కూతురు పెళ్లి కోసం ఆ భూమిని నాకు వాళ్ల తండ్రి అమ్మేస్తే ఇప్పుడు ఆమె ఇలా చేస్తోందని కొనుగోలు దారు వాపోతున్నారు.
ఈ పరిస్థితులు ఇలా ఉంటే మొదట్లో విక్రేత కుమారుడు ఇది కుటుంబ విషయమని, సామరస్యంగా పరిష్కరించుకుంటానని చెప్పాడు. అయితే కాలం మారిన కొద్ది అతని స్వరంలో కూడా మార్పు వచ్చింది. మేము ఈ విషయంపై చట్టపరమైన చర్య తీసుకుంటాము, మీరు న్యాయవాదిని పెట్టుకోవాలి" అని అతను కొనుగోలుదారులను బెదిరించాడని ఆరోపించారు. అయితే మళ్లీ అతను మాట మార్చాడు. కోర్టు వెలువల సమస్యను పరిష్కరించుకుందామంటూ రాయబారాలు పంపుతున్నాడని కొనుగోలు దారు వాపోతున్నారు. న్యాయమూర్తి ఆమెకు అనుకూలంగా తీర్పు ఇస్తే ఏమి జరుగుతుంది అంటూ తేలికపాటి బెదిరింపులను కూడా అతను ఉపయోగిస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ భూవివాదం విషయంపై కొనుగోలుదారు న్యాయ నిపుణులను సంప్రదించినప్పుడు.. న్యాయవాదులు కొనుగోలుదారు వద్ద సరైన అమ్మకపు డీడ్‌లు, పత్రాలు ఉన్నందున వారు బలమైన చట్టపరమైన స్థితిలో ఉన్నారని హామీ ఇచ్చారు.రెడ్డిట్‌లో షేర్ చేసిన ఈ పోస్ట్‌లో, చాలా మంది వినియోగదారులు కొనుగోలుదారునికి వైపే నిలిచారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉండి, ప్రభుత్వ రికార్డులతో అవిసరిపోలితే, మిమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కొందరు చెబుతున్నారు. మరొకరు ఇది కుటుంబ వారసత్వ సమస్యలో భాగమని హెచ్చరిస్తున్నారు.
మరొక నెటిజన్ ఇది స్కామ్ లా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. వారసత్వ సంపదలో కూతురికి ఏమి దక్కలేదనే సాకుతో ఇలీ బెదిరింపులకు దిగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా ఈ సంఘటన భూమిని కొనుగోలు చేసే సమయంలో ఆస్తి పత్రాలను తనిఖీ చేయాల్సిన ప్రాముఖ్యతను.. తర్వాత తలెత్తే చట్టపరమైన సమస్యలను హైలైట్ చేస్తుందని అంటున్నారు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications