Salary Hikes: పెరుగుతున్న ఖర్చులతో ప్రజలు సతమతమౌతున్నారు. ఈ క్రమంలో వేతనజీవుల ఆశలన్నీ జీతాలపైనే ఉన్నాయి. అసలు దేశంలో ఏ నగరాల్లో ఉద్యోగులకు ఎక్కువగా వేతనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమ్‌లీజ్ సర్వీసెస్ నివేదిక ప్రకారం 2023లో దేశంలో అత్యధికంగా వేతనాలు అందిస్తున్న నగరాల్లో బెంగళూరు తొలి స్థానంలో నిలిచింది. దేశంలోని వివిధ పరిశ్రమలలోని జీతాల ట్రెండ్‌ల ఆధారంగా FY2022-23లో అత్యధికంగా చెల్లించే నగరాల జాబితాలో బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్ ఉన్నాయ్. జీతాల పెంపు విషయంలో గత ఏడాదితో పోల్చితే బెంగుళూరు నగరం 7.79 శాతం వేతన వృద్ధి రేటుతో అందరినీ ఆకట్టుకుంటోంది.

బెంగళూరులోని టెలికాం రంగంలో రిలేషన్‌షిప్ మేనేజర్ పాత్ర 10.19% జీతం పెంపు తర్వాత మార్కెట్లో అత్యధికంగా చెల్లించే ఉద్యోగం. అలాగే మధ్యస్థ జీతాల పెంపు 8.03% వద్ద ఉంది. హెల్త్‌కేర్ & అనుబంధ పరిశ్రమలు తయారీ రంగంలో వేతన వృద్ధి అత్యధికంగా 20.46% గా ఉంది. అయితే ఇదే క్రమంలో విద్యా రంగంలో 51.83% సగటు జీతం వృద్ధిని సాధించి అగ్రస్థానంలో నిలిచింది.
అయితే ఇదే సమయంలో హాస్పిటాలిటీ, ఆటోమొబైల్ & అనుబంధ పరిశ్రమలు, ఈ-కామర్స్ & టెక్ స్టార్ట్అప్‌లు, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ వంటి పరిశ్రమల సగటు జీతాలు తగ్గాయి. గ్లోబల్ లేఆఫ్స్, స్టార్టప్ ఫండింగ్ వింటర్ కొనసాగుతున్నప్పటికీ భారతీయ ఉద్యోగ మార్కెట్ అభివృద్ధి చెందుతూనే ఉందని టీమ్‌లీజ్ సర్వీసెస్ CEO స్టాఫింగ్ కార్తిక్ నారాయణ్ తెలిపారు.


Click it and Unblock the Notifications