ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించడంలో బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (BLR Airport) మరో అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ (ACI) నుంచి లెవెల్ 3 యాక్సెసిబిలిటీ అక్రిడిటేషన్ పొందిన మొదటి భారతీయ విమానాశ్రయంగా చరిత్ర సృష్టించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విమానాశ్రయంలో దివ్యాంగుల (Persons with Disabilities - PwD) ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచినందుకు గానూ ఎయిర్‌పోర్ట్స్ కౌన్సిల్ ఇంటర్నేషనల్.. BLR ఎయిర్ పోర్ట్ కు ఈ నెల 21న లెవల్ 3 అక్రిడిటేషన్ ప్రకటించింది. బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (BIAL) ద్వారా నిర్వహించబడుతున్న ఈ విమానాశ్రయం కేవలం ఒక సంవత్సరంలోనే లెవెల్ 1 నుండి లెవెల్ 3కు చేరుకుంది. ఇది నిజంగా చాలా గొప్ప డెవలప్ మెంట్ అని నిపుణులు అంటున్నారు
దేశంలో మొట్టమొదటిసారి..
ACI యొక్క లెవెల్ 3 అక్రిడిటేషన్‌ను సాధించిన భారతదేశంలో మొట్టమొదటి విమానాశ్రయంగా BLR ఎయిర్ పోర్టు రికార్డు సృష్టించింది. దీని గురించి BIAL మేనేజింగ్ డైరెక్టర్ & సీఈవో.. హరి మారర్ మాట్లాడుతూ, "BLR ఎయిర్‌పోర్ట్‌లో, యాక్సెసిబిలిటీ అనేది మా డిజైన్ అండ్ ఆపరేషన్ లో భాగంగా ఉంది. లెవల్ 3 అక్రిడిటేషన్ సాధించడం మాకు గర్వకారణం. ఇది మేము చేస్తున్న నిరంతర కృషికి అద్దం పడుతోంది" అని అన్నారు.
బి-ఇన్‌క్లూడెడ్
బెంగళూరు ఎయిర్ పోర్ట్ 'బి-ఇన్‌క్లూడెడ్' అనే ప్రత్యేక విధానాన్ని తీసుకొచ్చింది. ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలను అందించేలా ప్రత్యేకంగా శిక్షణ పొందిన సిబ్బంది అందుబాటులో ఉంచారు. అలాగే విమానాశ్రయ వెబ్‌సైట్‌లో సోషల్ స్టోరీ అనే ఫీచర్ ఏర్పాటు చేశారు. ఇది ప్రయాణికులకు వారి ప్రయాణంలో ఏయే ప్రాంతాల గుండా వెళ్లాలి, ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి అనే దాని గురించి దశలవారీగా గైడ్ చేస్తుంది. అంతేకాకుండా.. సిరకొత్త యాక్సెసబిలిటీ విడ్జెట్ కూడా డిజైన్ చేశారు. ఇది దృష్టి, వినికిడి లేదా చలన సమస్యలు ఉన్నవారికి వెబ్‌సైట్‌ను సులభంగా నావిగేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇక వీటితోపాటు దివ్యాంగుల హక్కుల సంస్థలతో కలిసి ఈ విమానాశ్రయం పనిచేస్తుంది. ముఖ్యంగా, విమానాశ్రయం దివ్యాంగులను (PwDs) ఫ్రంట్‌లైన్ ఉద్యోగాల్లో నియమించుకుంది. వీరికి కావాల్సి ప్రత్యేక సహాయక పరికరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
కంప్లీట్ యాక్సెసబిలిటీ
BLR ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ ప్రాజెక్టులో యాక్సెసిబిలిటీకి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అన్ని చోట్లా ర్యాంపులు, సెన్సరీ రూమ్స్ ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు అనుకూలమైన విశ్రాంతి గదులు కూడా నిర్మించారు. ఆటిజం లేదా అల్జీమర్స్ వంటివి ఉన్న ప్రయాణికులకు కూడా తగిన ఎర్పాట్లు ఉన్నాయి.
దేశానికే ఆదర్శం
ఈ గుర్తింపు బెంగళూరు విమానాశ్రయాన్ని టాప్ లో ఉంచడమే కాకుండా.. భారతదేశంలోని ఇతర విమానాశ్రయాలకు ఒక మోడల్ స్టాండర్డ్ ని నెలకొల్పింది. యాక్సెసిబిలిటీకి ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రతి ప్రయాణీకుడు వారి సామర్థ్యంతో సంబంధం లేకుండా సులభంగా, గౌరవప్రదంగా ప్రయాణించగలిగేలా ఈ ఎయర్ పోర్ట్ చూసుకుంటోంది. భవిష్యత్తులో భారతీయ విమానాశ్రయాలన్నీ ఈ స్ఫూర్తిని అందిపుచ్చుకొనిమెరుగైన ప్రయాణ అనుభవాన్ని అందించాలని ఆశిద్దాం.
More From GoodReturns

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Bengaluru: మళ్ళీ పెరగనున్న టోల్ చార్జీలు.. ఏ రూట్లో ఎంత పెరిగిందంటే?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications