Stock Fall: ఆ బ్యాంక్ సీఈవో రాజీనామా.. కుప్పకూలిన స్టాక్.. 40 శాతం పడిపోవచ్చు..!!
Bandhan Bank: దేశీయ కార్పొరేట్ కంపెనీలను ప్రస్తుతం నాయకత్వ లోపం వెంటాడుతోంది. వరుసగా కంపెనీలను నడిపే సీఈవోలు రాజీనామాలు చేయటం వ్యాపారాల్లో కొనసాగుతున్న సంక్షిష్ట పరిస్థితులకు అద్ధం పడుతోంది.
మెున్న టెక్ దిగ్గజం విప్రో సీఈవో రాజీనామా అలజడి స్టాక్ మార్కెట్లలో కొనసాగుతుండగా.. నేడు ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ బంధన్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, CEO చంద్ర శేఖర్ ఘోష్ రాజీనామాతో కొనసాగుతోంది. ఈ నిర్ణయంతో నేడు మార్కెట్లో షేర్లు ప్రారంభంలోనే 9 శాతం మేర క్షీణతకు గురయ్యాయి. నిపుణుల అంచనా ప్రకారం స్టాక్ ధర 40 శాతం మేర పడిపోయే అవకాశం ఉందని తెలుస్తోంది.

తాను జూలై 9న తన గడువు పూర్తి కాగానే రిటైర్ అవుతానని ప్రకటించారు. ఘోష్ బ్యాంకును 2015 నుంచి అధినాయకత్వం వహిస్తున్నారు. ఈ చర్యతో బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ బంధన్ బ్యాంక్ రేటింగ్‌ను "BUY" నుంచి "Under Perform"కి తగ్గించింది. బ్రోకరేజ్ బంధన్ బ్యాంక్ టార్గెట్ ధరను రూ.290 నుండి రూ.170కి 40% తగ్గించింది. వాస్తవానికి ఘోష్ మూడేళ్ల పునర్నియామకానికి బోర్డు ఆమోదం తెలిపినప్పటికీ.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందలేదు. కంపెనీ వ్యవస్థాపకుడి రాజీనామా పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ బ్యాంకింగ్ కంపెనీ గ్రోత్ ఔట్‌లుక్ కూడా తగ్గించింది. బ్రోకరేజ్ ప్రకారం.. బ్యాంక్‌లోని చాలా మంది సీనియర్ ఉద్యోగులు కొత్తవారే. ఏదైనా సంభావ్య అనిశ్చితి నెమ్మదిగా వృద్ధికి దారి తీయటంతో పాటు బ్యాంకు కోసం అధిక రుణ ఖర్చులకు దారితీయవచ్చని పేర్కొంది. ఈ అనిశ్చితి కారణంగా జెఫరీస్ 2025-2026 ఆర్థిక సంవత్సరానికి క్రెడిట్ ఖర్చు అంచనాలను అలాగే బంధన్ బ్యాంక్ కోసం దాని వృద్ధి అంచనాలను తగ్గించింది. అటువంటి అనిశ్చితి కారణంగా బంధన్ బ్యాంక్ వాల్యుయేషన్ ప్రమాదంలో ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications