ఈ బ్యాంకులో మహిళలు అకౌంట్ ఓపెన్ చేస్తే చాలు పండగే.. ఎన్ని ఆఫర్లో..
బ్యాంకులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల పేర్లతో ఆఫర్లను అందిస్తుంటే కొన్ని బ్యాంకులు మాత్రం మహిళల కోసం ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తున్నాయి. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. కరెంట్ అకౌంట్, సేవింగ్స్ లేదా స్కోలర్షిప్, స్టూడెంట్ అకౌంట్ ఇలా రకరకాల అకౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ మహిళా కస్టమర్ల కోసం ప్రత్యేక సేవింగ్స్ అకౌంట్ తాజాగా అవనిని ప్రకటించింది. దీనిని ముఖ్యంగా మహిళలను దృష్టిలో ఉంచుకుని ప్రవేశపెట్టారు. దీనితో పాటు బ్యాంక్ లాయల్టీ ప్రోగ్రామ్ బంధన్ బ్యాంక్ డిలైట్స్ కూడా ప్రారంభించింది. ఇందులో కస్టమర్‌లు డిలైట్ పాయింట్స్ అనే రివార్డ్ పాయింట్స్ సంపాదించుకోవచ్చు, సంపాదించిన డిలైట్ పాయింట్‌లను ఏదైనా కొనేందుకు ఉపయోగించుకోవచ్చు ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా పొందవచ్చు. బంధన్ బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా దీనిని తీసుకొచ్చింది.
అవని సేవింగ్ అకౌంట్
అవని బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్తో మహిళా కస్టమర్‌లు ఉచిత ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్, రూ. 10 లక్షల పర్సనల్ ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్, రూ. 3.5 లక్షల కార్డ్ లాస్ లయబిలిటీ, ప్రీమియం బ్రాండ్‌ల నుండి ఆఫర్స్ అందించే స్పెషల్ డెబిట్ కార్డ్ పొందుతారు. అవని అన్యువల్ లాకర్ రెంటల్, గోల్డ్ లోన్ ప్రాసెసింగ్ ఫీజులతో పాటు బ్యూటీ అండ్ వెల్నెస్ ప్రొడక్ట్స్ పై ఆకర్షణీయమైన డిస్కౌంట్స్ కూడా అందిస్తుంది.

బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్
బంధన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రతన్ కేష్ మాట్లాడుతూ "మా మహిళా కస్టమర్లకు గుర్తుగా మా వ్యవస్థాపక దినోత్సవం రోజున ప్రత్యేకంగా మహిళల కోసం రూపొందించిన అవని అనే సేవింగ్స్ అకౌంట్ లాంచ్ చేయాలనీ మేము ప్లాన్ చేసాము అని అన్నారు. బంధన్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ రాజిందర్ బబ్బర్ మాట్లాడుతూ "అవనిని పరిచయం చేయడం ద్వారా మేము మా మహిళా కస్టమర్ల ఆర్థిక ఇంకా లైఫ్ స్టయిల్ అవసరాలను తీర్చడమే కాకుండా, వాల్యూ ఆధారిత సేవలతో మొత్తం బ్యాంకింగ్ అనుభవాన్ని కూడా పెంచుతున్నాము."అని అన్నారు.
బంధన్ బ్యాంక్ డిలైట్స్
బంధన్ బ్యాంక్ డిలైట్స్ అనేది ఎంటర్‌ప్రైజ్-వైడ్ లాయల్టీ ప్రోగ్రామ్, దీని కింద కస్టమర్‌లు అకౌంట్ ఓపెనింగ్, కార్డ్ ట్రాన్సక్షన్, ఫండ్ ట్రాన్సక్షన్, ఇంకా మరిన్నిటి పైన డిలైట్ పాయింట్స్ పొందుతారు. ఈ ప్రోగ్రామ్ ద్వారా కస్టమర్‌లు ట్రావెల్, ఆకోమోడేషన్, మెర్చండైస్, ఎంటర్టైన్మెంట్, స్పెషల్ ఆఫర్స్ పై రివార్డ్స్ పాయింట్‌లను రీడీమ్ చేయవచ్చు. కస్టమర్‌లు డిలైట్ పాయింట్‌లను ఎయిర్ మైల్స్‌గా కూడా మార్చుకోవచ్చు.


Click it and Unblock the Notifications