Banking News: నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలను ఒకచోటికి చేర్చడానికి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు చేపట్టింది. కాగా బంధన్ బ్యాంక్ కూడా NBFCలతో జత కట్టడానికి సిద్ధమైంది. కొత్త వ్యాపారంలోకి ప్రవేశించనున్నట్లు బ్యాంక్ ప్రకటించింది.
కొత్తగా కో-లెండింగ్ బిజినెస్ లోకి దిగుతున్నట్లు బంధన్ బ్యాంక్ MD&CEO చంద్రశేఖర్ ఘోష్ తెలిపారు. మొత్తం 2 NBFCలతో కలవనున్నట్లు ప్రకటించారు. బ్యాంక్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో ఈ మేరకు వెల్లడించారు. తద్వారా రుణాలిచ్చే అన్ని విభాగాలనూ ఈ వ్యాపారం కవర్ చేస్తునందని చెప్పారు.

"మేము కొన్ని NBFCలను ఎంచుకున్నాము. త్వరలో వాటితో టై అప్ అవుతాము" అని ఘోష్ ప్రకటించారు. 8 ఏళ్ల క్రితం ప్రారంభమైన బ్యాంక్.. ప్రస్తుతం 35 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మొత్తం 6 వేల 100 శాఖలతో సేవలందిస్తోందన్నారు. తాజాగా లేహ్ లో ఓ బ్రాంచ్ లాంచ్ చేయగా.. వచ్చే నెలలో కార్గిల్ లో మరో శాఖను ప్రారంభిస్తామని తెలిపారు.
బ్యాంకుకు 3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారని.. వ్యాపార సామర్థ్యం 2 లక్షల కోట్లకు పైమాటేనని వెల్లడించారు. CASA డిపాజిట్లు 39 శాతం వద్ద ఉన్నట్లు చెప్పారు. మొత్తం బ్యాంకు లావాదేవీల్లో 94 శాతం డిజిటల్ మోడ్ లో జరుగుతన్నట్లు పేర్కొన్నారు. భౌగోళికంగా, పోర్ట్ ఫోలియో వారీగా వైవిధ్యభరితంగా బిజినెస్ కొనసాగిస్తున్నామన్నారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications