ప్రతి ఒక్కరి జీవితంలో ప్రయాణాలు, టూర్లు ఎంతో గుర్తుండిపోతాయి ఇంకా మంచి అనుభవాన్ని ఇస్తాయి. అయితే చాల మందికి విమానాల్లో ప్రయాణించాలని కోరిక ఉంటుంది అంతేకాదు విమానాల్లో ప్రయాణించడం అనేది అదొక ప్రత్యేకమైన అనుభవం. ఎక్కడికైనా విమానాల్లో ప్రయాణించాల్సి వచ్చినపుడు అవసరమైనవి ఇంకా కావాల్సిన షాపింగ్ చేయడం సహజం, ఒకోసారి ఎయిర్ పోర్టులో నచ్చినవి, గిఫ్ట్స్ కొనడం కూడా చేస్తుంటారు. కానీ ఎయిర్ పోర్టులో లభించే ఫుడ్ సాధారణంగా మనకు మార్కెట్లో ఉండే రేట్ల కంటే కాస్త కాస్ట్లీగానే ఉంటాయి.

కానీ ఈ ఎయిర్ పోర్టులో ఉండే వస్తువులు ఇంకా ఆహార పదార్ధాల ధరలు చాలా ఫెమస్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రయాణికులు ఈ ఎయిర్ పోర్టుని 'ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ' అని పిలుస్తారు. ఎందుకంటే ఈ విమానాశ్రయంలో అన్ని కూడా చాలా కాస్ట్లీ, ఇక్కడ మీరు ఒక్క అరటిపండు కొనాలంటే రూ.500 చెల్లించాలి. మార్కెట్ నుంచి కొనుకొచ్చిన అరటిపండు ఎయిర్ పోర్టులోకి వచ్చాక ధరలు ఈ రేంజ్లో పెంచడం సరైనదేనా అని ప్రయాణికులు నోరెళ్లబెడుతున్నారు. ఈ విమానాశ్రయం అత్యంత ముఖ్యమైన ఆహార పదార్థాలను కూడా ప్రీమియం ధరకు విక్రయిస్తున్నారు. సాధారణంగా, విమానాశ్రయంలో లభించే వస్తువులు రెంట్, మెయింటెనెన్స్ ఇతర ఖర్చులు, భద్రతా నిబంధనలు మొదలైన వాటి కారణంగా కొంచెం కాస్ట్లీగా ఉంటాయి.
కానీ ఈ ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టు కథ వేరేలా ఉంది. ఇక్కడ ఒక బీరు £15 అంటే రూ.1,697, ఇక ఒక అరటిపండు ధర £5 అంటే రూ.565 కి అమ్ముడవుతోంది. ఇక్కడి లోకల్ పబ్‌లో మూడు బీర్లు కొని స్నేహితుడికి ఇవ్వడానికి మీకు రూ.1,697 సరిపోదు ఎక్కువే కావాలి. కానీ కూరగాయల మార్కెట్లో అదే ధరకు 5-10 కిలోల అరటిపండ్లు దొరుకుతాయి. సమాచారం ప్రకారం, ఈ ఇస్తాంబుల్ విమానాశ్రయం టర్కీలో ఉంది. ఈ విమానాశ్రయం టర్కీలో అతిపెద్దది ఇంకా ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటి. 2019లో పూర్తయిన ఈ ఆధునిక విమానాశ్రయం ప్రయాణీకులకు అనుకూలమైన, అనువైన సేవలను కూడా అందిస్తుంది.
టర్కీ ప్రధాన విమానాశ్రయం రోజుకు సగటున 220,000 మంది ప్రయాణీకులకి రాకపోకలు సాగిస్తుంది. అయితే, చాలా మంది ప్రయాణికులు ఇక్కడ అమ్మకానికి ఉన్న వస్తువుల ధరలపై అసంతృప్తి వ్యక్తం చేశారు, ముఖ్యంగా ఆహారం, పానీయాల ధరలు భరించలేనివిగా భావిస్తున్నారు. ఈ అధిక ధరలు ప్రయాణీకుల అనుభవాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది.
పెరుగుతున్న ధరలు, చేతులు కాల్చుకుంటున్న ప్రయాణికులు: ఇటాలియన్ వార్తాపత్రిక కొరియర్ డెల్లా సెరా ప్రకారం, ఇస్తాంబుల్ విమానాశ్రయం ఆహారం, పానీయాలకు యూరప్‌లో 'అత్యంత ఖరీదైన విమానాశ్రయం'గా పేరు పొందింది. విమానాశ్రయంలో 90 గ్రాముల లాసాగ్నా (ఇటాలియన్ వంటకం)ను £21 అంటే రూ.2,376కి అమ్మిన అనుభవాన్ని ఒక ఇటాలియన్ రచయిత వివరిస్తూ ఇది కేవలం డబ్బు వృధా అని అన్నారు. మరో విచిత్రం ఏమిటంటే, మెక్‌డొనాల్డ్స్ అండ్ బర్గర్ కింగ్ వంటి పాకెట్ ఫ్రెండ్లీ ఫాస్ట్ ఫుడ్ సంస్థలు కూడా కొన్ని వంటకాలను చాలా ఎక్కువ ధరలకు అమ్ముతున్నాయి.


Click it and Unblock the Notifications