క్రిప్టోకరెన్సీపై నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే? పెట్రోల్ ధరలు తగ్గించలేం..
క్రిప్టో కరెన్సీకి సంబంధించిన బిల్లును కేబినెట్ ముందు ఉంచామని, కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తున్నామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. 'క్రిప్టో కరెన్సీ బిల్లుపైన కేబినెట్ నోట్ సిద్ధంగా ఉంది. కేబినెట్ అప్రూవల్ కోసం వేచి చూస్తున్నాను' అని సోమవారం అన్నారు. క్రిప్టో స్థిరత్వంపై కేంద్ర బ్యాంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఆందోళన విశ్వసించదగినదే అన్నారు. ఆర్థిక స్థిరత్వం పరిరక్షణకు కేంద్రం, ఆర్బీఐ కట్టుబడి ఉన్నాయన్నారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌తో తలెత్తే పరిణామాలపై ఆర్బీఐ తన ఆందోళనను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిందన్నారు.
ప్రతిపాదిత క్రిప్టో బిల్లుపై కేంద్ర కేబినెట్ ఆమోదం కోసం వేచి చూస్తోదని చెప్పారు. ఇంతకుముందు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సారథ్యంలోని వివిధ శాఖల కార్యదర్శుల కమిటీ క్రిప్టో కరెన్సీల ట్రేడింగ్, పర్యవసనాలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కేంద్రం విడుదల చేసే వర్చువల్ కరెన్సీ మినహా ఇతర ప్రయివేటు క్రిప్టో కరెన్సీలపై నిషేధం విధించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

పెట్రోల్, డీజిల్ ధరలపై ఏం చెప్పారంటే?
పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే అవకాశం లేదని నిర్మలా సీతారామన్ చెప్పారు. ఇంధన సబ్సిడీల కోసం గత యూపీఏ ప్రభుత్వం జారీచేసిన ఆయిల్ బాండ్స్, వడ్డీలకు ఇప్పుడు చెల్లింపులు జరుపుతున్నందున, పెట్రో ఎక్సైజ్ సుంకాల్ని తగ్గించలేమన్నారు. గత అయిదేళ్లుగా ఈ బాండ్లపై రూ.60,000 కోట్ల వడ్డీని చెల్లించామన్నారు. ఇంకా రూ.1.30 లక్షల కోట్ల బకాయిలున్నాయన్నారు.


Click it and Unblock the Notifications