Trending Stock: నాలుగు రోజుల్లో 71% పెరిగిన స్టాక్.. కంపెనీ ఏమని చెప్పిందంటే..?
Trending Stock: గత వారం రోజులుగా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా కుదేలవతూనే ఉన్నాయి. ఇంత ఓలటాలిటీ మార్కెట్లోనూ వరుసగా షేర్ ధర పెరగటం అంత ఈజీ కాదు. అయితే ఒక పేపర్ కంపెనీ షేర్ మాత్రం నాలుగు రోజులుగా దాదాపు 70 శాతం కంటే ఎక్కువగా లాభపడింది. అసలు ఈ స్టాక్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

కంపెనీ వివరాలు..
ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది బాలకృష్ణ పేపర్ మిల్స్ షేర్లలో భారీ ర్యాలీ గురించే. ఇక్కడ అందరికీ అంతుచిక్కని విషయం ఏమిటంటే అసలు స్టాక్ ఎందుకిలా ర్యాలీ చేస్తోంది అన్నదే. పేపర్ ఉత్పత్తుల రంగంలోని కంపెనీ స్టాక్ షేర్ వరుసగా అప్పర్ సర్క్యూట్లను తాకుతూ పెరుగుతోంది. గురువారం కూడా ప్రారంభ ట్రేడింగ్‌లో కంపెనీ షేర్లు 10% పెరిగి రూ.50.75కి చేరుకున్నాయి. బుధవారం కంపెనీ షేర్లలో చాలా బల్క్ డీల్స్ జరిగాయి.

కంపెనీ వివరణ..
అసలు బాలకృష్ణ పేపర్ మిల్స్ మాత్రం కంపెనీ షేర్లు పెరగడానికి కారణం తెలియడం లేదని స్పష్టం చేసింది. షేర్ ధర పెరుగుదలకు సంబంధించి, వ్యాల్యూయేషన్లను ప్రభావితం చేసే సమాచారం ఏమీ కంపెనీ వద్ద లేదని బాలకృష్ణ పేపర్ మిల్స్ ఎక్స్ఛేంజీకి తెలియజేసింది. గత 2 ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు 20-20% లాభపడ్డాయి. మరోవైపు బాలకృష్ణ పేపర్ మిల్స్ షేర్లు సోమవారం 8 శాతానికి పైగా లాభపడ్డాయి. స్టాక్ 52 వారాల కనిష్ఠ ధర రూ.25.05 ఉండగా.. షేర్ 52 వారాల గరిష్ఠ ధర రూ.58.45గా ఉంది.

నాలుగు బల్క్ డీల్స్..
బుధవారం బాలకృష్ణ పేపర్ మిల్స్ షేర్లలో మెుత్తం 4 బల్క్ డీల్స్ జరిగాయి. ఈ డీల్స్ రూ.44.73 నుంచి రూ.46.20 రేంజ్‌లో జరిగాయి. బాలకృష్ణ పేపర్ మిల్స్ సియారామ్ పొద్దార్ గ్రూప్‌లో భాగం. గ్రూప్ టెక్స్‌టైల్స్, గార్మెంట్స్ నూలు, గృహోపకరణాలు, పేపర్ విభాగాల్లో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. కంపెనీ కోటెడ్ డ్యూప్లెక్స్ బోర్డులను తయారు చేస్తోంది. వీటిని వివిధ పరిశ్రమల్లో ప్యాకేజింగ్ కోసం ఉపయోగిస్తారు. గత ఏడాది కాలంలో బాలకృష్ణ పేపర్ మిల్స్ షేర్లు దాదాపు 82% లాభపడ్డాయి. కంపెనీలో ప్రమోటర్లు 58.70% వాటాను కలిగి ఉండగా.. మార్కెట్ క్యాప్ రూ.52 కోట్లుగా ఉంది.


Click it and Unblock the Notifications