Multibagger stock: లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలు వస్తాయని వినటమే కానీ చూసింది చాలా తక్కువ అయి ఉండవచ్చు. అసలు స్టాక్ మార్కెట్లలో ఇలా జరుగుతుందా అని కూడా కొంత మందికి అనుమానాలు ఉంటూనే ఉంటాయి. అలాంటి దానికి చక్కటి ఉదాహరణే ఈ మల్టీబ్యాగర్ స్టాక్. ఈ స్టాక్ లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా రూ.21 కోట్లుగా మార్చేసింది. అది కూడా 20 సంవత్సరాల కాలంలో. ఇందులో పెట్టుబడి పెట్టిన వారికి సిరుల పంట కురిసిందని చెప్పుకోక తప్పదు. వారి ఫేట్ మార్చిన ఈ షేర్ పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

20 వేల శాతం రాబడి..
కొంత మంది స్టాక్ మార్కెట్ ప్రస్తుత పరిస్థితులను చూసి భయంతో ఎక్కువ కాలం తమ పెట్టుబడులను కొనసాగించేందుకు ఇష్టపడరు. తరువాత ఆ స్టాక్ మంచి రాబడులను అందించినప్పుడు అయ్యో.. పెట్టుబడిని కొనసాగించి ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటారు. ఇలా మీ విషయంలో జరగకూడదనుకుంటే.. మంచి ఫండమెంటల్స్, కన్సిస్టెంట్ పర్ఫామెన్స్ ఉండే కంపెనీల షేర్లను ఎంచుకోవాలి. టైర్ల వ్యాపారంలో ఉన్న బాలకృష్టా ఇండస్ట్రీస్ (Balkrishna Industries) షేర్ కూడా ఆ కోవకు చెందినదే. ఇది దీర్ఘకాలంలో 20 వేల శాతం కంటే ఎక్కువ రాబడిని తన ఇన్వెస్టర్లకు అందించింది.

లక్షకు కోట్ల రాబడి..
ఒకప్పుడు పెన్నీ స్టాక్ గా ఉన్న ఈ కంపెనీ షేర్ తన ప్రస్థానాన్ని కేవలం రూ.1 నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఈ షేర్ విలువ రూ.2,130 వద్ద ఉంది. దీని 52 వారాల గరిష్ఠ ధర రూ.2,724 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠం రూ.1,690 వద్ద ఉంది. 2002 జూన్ 7న బీఎస్ఈలో షేర్ విలువ కేవలం ఒక్క రూపాయిగా ఉంది. కానీ ఇప్పుడు దాని ధర రూ.2100 కంటే ఎక్కువగా ఉంది. ఒక ఇన్వెస్టర్ అప్పట్లో లక్ష పెట్టుబడి పెట్టి ఉండే ఇప్పుడు దాని విలువ రూ.21 కోట్లకు చేరుకుని ఉండేది. కనీసం 50 వేలు ఇన్వెస్ట్ చేసినా దాని విలువ రూ.10 కోట్లకు పైగానే ఉండేది.

కనీసం 10 ఏళ్ల క్రితం ఇన్వెస్ట్ చేసినా..
బాలకృష్ణ ఇండస్ట్రీస్ స్టాక్ గడచిన 10 ఏళ్లలో 17 రెట్లు వృద్ధిని నమోదు చేసింది. 2012లో ఒక ఇన్వెస్టర్ రూ. లక్ష పెట్టుబడిగా పెట్టి ఉంటే..ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అతను రూ.17 లక్షల కంటే ఎక్కువే రిటర్న్స్ పొందేవాడు. కనీసం ఐదు సంవత్సరాల క్రితం ఇన్వెస్ట్ చేసినా మంచి రాబడి వచ్చి ఉండేది.
గమనిక: పైన తెలిపిన వివరాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు రిస్క్ తో కూడుకున్నవి. ఇన్వెస్ట్ చేసే ముందు ఆర్థిక సలహాదారులను తప్పక సంప్రదించి నిర్ణయాలు తీసుకోండి.


Click it and Unblock the Notifications