ఒక్క రోజులో మారిన రైతు తలరాత.. రూ.500 లతో రూ.12 కోట్లు.. 15 ఏళ్ల నిరీక్షణకు తెర..!
మనిషి జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేరు. కోటీశ్వరుడు పేదవాడు కావొచ్చు.. పేదవాడు కోటీశ్వరుడు కావొచ్చు. ఏదైనా జరుగొచ్చు అందుకే ఉన్నాయని మురిసిపోవద్దు. లేవని బాధపడొద్దు. ఒక్కోసారి మన అదృష్టం బాగుంటే కలిసొచ్చే అవకాశం ఉంటుంది. తాజాగా ఏ రైతు ఒక్క రోజులో కోటీశ్వరుడిగా మారిపోయాడు. పంజాబ్ కు చెందిన ఓ రైతు జాక్ పాట్ కొట్టాడు. అయితే అతను
జాక్ పాట్ కొట్టడానికి 15 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. తాజాగా అతను కొనుగోలు చేసిన లాటరీ టికెట్ భారీ బహుమతి గెలుచుకుంది. రూ.500 లతో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ తో రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.
ఆ రైతు ఒక్క రోజులో కోటీశ్వరుడు అయ్యాడు. రూ.12 కోట్ల లాటరీ తగలడంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు. ఇంతకీ ఈ రూ.12 కోట్ల బహుమతి గెలుచుకున్న రైతు పేరు చెప్పలేదు కదూ.. ఆయన 45 ఏళ్ల బల్జిందర్ సింగ్. పంజాబ్లోని మొహాలీ జిల్లా హమాయున్పూర్ గ్రామానికి చెందిన ఆయన వ్యవసాయం చేస్తాడు. బల్జిందర్ సింగ్ వ్యవసాయంతో పాటు ట్రక్ డ్రైవర్ గా కూడా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బల్జిందర్ సింగ్ 2010 లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు.

కొన్ని సంవత్సరాలుగా లాటరీ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. అతను ఎప్పుడు లాటరీ టికెట్ కొనుగోలు చేసినా తగిలేది కాదు. ప్రతిసారి లాటరీ ఫలితాలు చూసుకునేవాడు. ఇలా 15 ఏళ్లుగా బల్జిందర్ సింగ్ నిరీక్షణ కొనసాగింది. ఫైనల్ గా ఆయన నిరీక్షణకు తెరపడింది. దీపావళికి ముందు హండేస్రాలోని ఓ లాటరీ విక్రేత వద్ద బల్జిందర్ సింగ్ రూ.500 పెట్టి టికెట్ కొనుగోలు చేశాడు. నవంబరు 16న నిర్వహించిన పంజాబ్ స్టేట్ డియర్ దీపావళి బంపర్ లాటరీ డ్రాలో అతడికి మొదటి బహుమతి వచ్చింది ఆ వార్త విన్న వెంటనే అతడు మొదట్లో షాక్ అయ్యాడు. ఆ తర్వాత కుటుంబ సభ్యలకు విషయం చెప్పాడు.
దేవుడు తన ప్రార్థనలు విన్నాడని బల్జిందర్ పేర్కొనాడు. తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పకుండా దాదాపు 15 సంవత్సరాలుగా లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నట్లు గుర్తు చేసుకున్నాడు. ఈ లాటరీ డబ్బులతో తన పిల్లలను బాగా చదివిస్తానని బల్జిందర్ చెప్పాడు. లాటరీ గెలిచిన విషయం గ్రామంలో తెలియడంతో స్థానికులు అతడి ఇంటికి చేరుకుని అభినందనలు చెప్పారు. కాగా బల్జిందర్ సింగ్ కొన్న లాటరీ టికెట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్సైట్లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్సైట్లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications