ప్రపంచంలోనే అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాల్లో ఇండోనేషియాలోని 'బాలీ' (Bali) ఒకటి. తక్కువ ఖర్చుతో విదేశీ పర్యటన ముగించాలనుకునే భారతీయులకు కూడా ఇది ఫేవరెట్ డెస్టినేషన్. అయితే ఇకపై బాలీ వెళ్లడం మునుపటి అంత సులభం కాదు. మీరు బాలీ టూర్ (Bali tour) ప్లాన్ చేసుకుంటున్నట్లయితే, విమానం ఎక్కకముందే మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో అక్కడి అధికారులకు చూపించాల్సి ఉంటుంది.

ఏమిటీ 'ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్' (Proof of Funds) రూల్?
బాలీ గవర్నర్ వాయన్ కోస్టర్ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. బాలీకి వచ్చే పర్యాటకులు నాణ్యమైన సేవలు పొందాలని, అలాగే అక్కడ ఉన్నంత కాలం తమను తాము పోషించుకోగల ఆర్థిక స్తోమత వారికి ఉండాలని ఈ నిబంధన తీసుకువచ్చారు. దీనినే 'క్వాలిటీ టూరిజం' (Quality Tourism) అని పిలుస్తున్నారు.
ఇకపై మీరు 'వీసా ఆన్ అరైవల్' (Visa on Arrival) తీసుకోవాలన్నా సరే.. మీ బ్యాంక్ స్టేట్‌మెంట్స్ చూపించాలి. గత మూడు నెలలుగా మీ సేవింగ్స్ అకౌంట్‌లో తగినంత డబ్బు ఉందా లేదా అని అధికారులు తనిఖీ చేస్తారు. సాధారణంగా కొన్ని రకాల వీసాలకు $2,000 (సుమారు రూ. 1.6 లక్షలు) కనీస బ్యాలెన్స్ అడుగుతుంటారు. కానీ, కొత్త రూల్ ప్రకారం మీరు అక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఏయే ప్రాంతాలు సందర్శిస్తారు అనే దాన్ని బట్టి ఈ మొత్తాన్ని అధికారులు నిర్ణయిస్తారు.
ఎందుకు ఈ కఠిన నిబంధనలు?
2025లో బాలీకి రికార్డు స్థాయిలో టూరిస్టులు తరలివచ్చారు. దాదాపు 70 లక్షల మందికి పైగా పర్యాటకులు రావడంతో అక్కడి మౌలిక సదుపాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ట్రాఫిక్ జామ్‌లు, వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ కాలుష్యం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. అందుకే కేవలం 'క్వాలిటీ టూరిస్టుల'ను మాత్రమే అనుమతించాలని బాలీ ప్రభుత్వం భావిస్తోంది.
బాలీ టూర్ ప్లాన్ చేసేవారు దగ్గర పెట్టుకోవాల్సినవి..
మీరు అక్కడి వెళ్లినప్పుడు ఇమ్మిగ్రేషన్ అధికారులు మిమ్మల్ని ఈ క్రిందివి అడిగే అవకాశం ఉంది:
- తిరుగు ప్రయాణ టికెట్ (Return Ticket)
- హోటల్ బుకింగ్ వివరాలు, టూర్ ప్లాన్ (Itinerary)
- గత మూడు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్
ప్రకృతి ప్రకోపం: పర్యాటకులు జాగ్రత్త!
కొత్త రూల్స్ పక్కన పెడితే.. ప్రస్తుతం ఇండోనేషియాలో వాతావరణం ఏమాత్రం బాగోలేదు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో జావా, సులవేసి, పాపువా వంటి ద్వీపాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే సులవేసిలో వచ్చిన ఆకస్మిక వరదల వల్ల 14 మంది ప్రాణాలు కోల్పోయారు. గత నవంబర్‌లో సుమత్రాలో వచ్చిన తుపాను, వరదల వల్ల వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అడవుల నరికివేత వల్ల ఇక్కడ వరదల ప్రభావం ఎక్కువగా ఉంటోంది.
మొత్తంగా మీరు గానీ బాలీ టూర్ (Bali tour) వెళ్లాలనుకుంటే కేవలం బడ్జెట్ చూసుకుంటే సరిపోదు. మీ బ్యాంక్ అకౌంట్‌లో 'ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్' కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. అలాగే వెళ్లే ముందు వాతావరణ హెచ్చరికలను కూడా గమనించడం మర్చిపోకండి. విదేశీ పర్యటన అంటే కేవలం సరదా మాత్రమే కాదు, బాధ్యత కూడా అని బాలీ ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: రియల్ ఎస్టేట్‌లో మారిన లెక్కలు! బెంగళూరు, హైదరాబాద్‌లో ట్రెండ్ ఎలా ఉందంటే..



Click it and Unblock the Notifications