Postal Insurance: మనం ప్రస్తుతం ఆధునిక ఇంటర్నెట్ కాలంలో ఒకప్పుడు మనందరినీ కనెక్ట్ చేసింది మాత్రం పోస్టాఫీసే. ఆ కాలం నుంచి ఇప్పటి వరకు మనం చాలా మార్పులను చూస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోస్టాఫీసు సైతం దీనికి అనుగుణంగా మారుతూ మనియార్డర్, కొరియర్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, డిజిటల్ పేమెంట్స్ అంటూ తనను తాను కాలానుగుణంగా మార్చుకుంటూ వచ్చింది.
అటువంటి పోస్టాఫీసు ఇప్పుడు దేశ ప్రజలకు ముఖ్యమైన పెట్టుబడి, ఆర్థిక సేవలతో మరింతగా చేరువైంది. ఇండియా పోస్ట్ చాలా తక్కువ ఖర్చుతో పిల్లలకు లైఫ్ ఇన్సూరెన్స్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. బాల్ జీవన్ బీమా యోజన పేరుతో దీనిని దేశంలో విక్రయిస్తోంది. ఈ స్కీమ్ కింద రోజుకు కేవలం రూ.6 ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే నెలకు రూ.180 చెల్లించాలన్నమాట.

ఈ స్కీమ్ కింద చిన్న పిల్లలకు రూ. లక్ష లైఫ్ ఇన్సూరెన్స్ లభిస్తుంది. ఒకవేళ అనుగోని దుర్ఘటన కారణంగా బీమా పొందిన పిల్లలు మరణిస్తే వారికి కవరేజ్ మెుత్తాన్ని పోస్టల్ ఇన్సూరెస్స్ కింద లభిస్తుంది. స్కీమ్ ముఖ్య లక్షణం తక్కువ పెట్టుబడి మొత్తం, అంటే చాలా తక్కువ రోజువారీ డిపాజిట్ ఉన్నందున కుటుంబంపై తక్కువ ఆర్థిక భారం ఉంటుంది. దీని ద్వారా దేశంలోని అట్టడుగు వర్గాలకు కూడా జీవిత బీమా ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ స్కీమ్ పిల్లలకు 18 ఏళ్లు వచ్చేంత వరకు కవరేజ్ అందిస్తుంది.
అలాగే స్కీమ్ కింద ఉన్న పిల్లలు 20 ఏళ్ల వయస్సు దాటితే పెట్టుబడి పెట్టిన మొత్తం గ్రామ సంతోష్ స్కీమ్ వడ్డీ ప్రయోజనాలతో పాటు మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతుంది. ప్రస్తుతం గ్రామ సంతోష్ పథకం బోనస్ మొత్తం రూ.1000కి రూ. 48గా ఉంది. ముందుగా రక్షణ అందించిన స్కీమ్ 20 ఏళ్ల తర్వాత పిల్లల విద్య లేదా ఇతర ఆర్థిక బాధ్యతలకు సంబంధించిన ఖర్చులను కవర్ చేయడానికి తోడ్పాటుగా నిలుస్తుంది. ఇందులో బీమా రక్షతో పాటు పెట్టుబడి ప్రయోజనాల మిళితం లభిస్తుంది.
ప్రతి తల్లిదండ్రులు గరిష్ఠంగా ఇద్దరు పిల్లలకు దీనిని పొందవచ్చు. బాల్ జీవన్ బీమా ప్లాన్‌లో అదనపు లైఫ్ కవర్ 1 లక్షకు పరిమితం అని మర్చిపోవద్దు. ఉదాహరణకు 10 ఏళ్ల పిల్లవాడు రోజుకు రూ.6 పెట్టుబడితో 5 సంవత్సరాల పెట్టుబడికి రూ.లక్ష వరకు బీమా రక్షణ పొందవచ్చు. పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద బాల్ జీవన్ బీమా ప్లాన్ 3 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. పూర్తి వివరాల కోసం మీ సమీపంలోని పోస్టాఫీసును సందర్శించి స్కీమ్ పూర్తి వివరాలు, ప్రయోజనాలను తెలుసుకోవచ్చు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications