Multibagger Stock: తుఫాను పెరుగుదల.. రూ.లక్ష పెట్టుబడిని 15 కోట్లు చేసిన స్టాక్..
Multibagger Stock: ప్రస్తుతం మార్కెట్లో భారీ వ్యాపారాన్ని నిర్వహిస్తూ, మంచి రాబడులను పొందుతున్న ాచలా కంపెనీలు ఒకప్పుడు చిన్నగానే ప్రారంభమయ్యాయి. దీర్ఘకాలంలో తుఫాను రాబడులను ఇన్వెస్టర్లకు అందించాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బజాజ్ గ్రూప్ కంపెనీ అయిన బజాజ్ ఫైనాన్స్ స్టాక్ గురించే. దేశంలో ఆర్థిక విప్లవం కొనసాగుతున్న వేళ కంపెనీ వ్యాపారం విస్తృతంగా వృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో గత కొన్నేళ్లుగా కంపెనీ ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తోంది. ఈ క్రమంలో బజాజ్ ఫైనాన్స్ షేర్లు 149000% కంటే ఎక్కువ రాబడిని అందించింది. ఈ కాలంలో కంపెనీ స్టాక్ ధర రూ.5 నుంచి రూ.7,000కి చేరుకుంది.

ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో ఎన్ఎస్ఈలో బైజాజ్ ఫైనాన్స్ షేరు ధర రూ.6,986.70 వద్ద ఉంది. స్టాక్ నేడు స్వల్ప నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ రేటు రూ.7,778గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ స్థాయి రూ.5,335.05 వద్ద ఉంది. ఏడాది కాలంలో 28 శాతానికి పైగా రాబడితో ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
బీఎస్ఈలో జూలై 25,2003న బజాజ్ ఫైనాన్స్ కంపెనీ షేర్ల ధర రూ.4.71గా ఉంది. అలాగే జూన్ 22, 2023న BSEలో కంపెనీ షేర్లు రూ.7033.80 వద్ద ముగిశాయి. ఈ క్రమంలో ఎవరైనా ఇన్వెస్టర్ అప్పట్లో కంపెనీ షేర్లలో ఎవరైనా రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం దాని విలువ రూ.14.9 కోట్లకు చేరుకుని ఉండేది. మంచి ఫండమెంటల్స్, గ్రోత్ ఫ్యూచర్ కలిగిన కంపెనీల్లో దీర్ఘకాలం పెట్టుబడి పెడితే ఎవరైనా ఇన్వెస్టర్ ఇలాంటి మల్టీబ్యాగర్ రాబడులను పొందవచ్చని మరోసారి నిరూపితమైంది.
బజాజ్ ఫైనాన్స్ షేర్లు గత 15 ఏళ్లలో 54131% పెరిగాయి. 4 జూలై 2008న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)లో కంపెనీ షేర్లు రూ.12.97 వద్ద ట్రేడింగ్ అయ్యాయి. జూన్ 22, 2023న BSEలో బజాజ్ ఫైనాన్స్ షేర్ రూ.7,033.80 వద్ద ముగిసింది. ఒక వ్యక్తి జూలై 4, 2008న బజాజ్ ఫైనాన్స్ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి కంపెనీ షేర్లను విక్రయించకుండా కొనసాగించి ఉంటే ప్రస్తుతం ఈ షేర్ల విలువ రూ.5.4 కోట్లుగా ఉండేది.


Click it and Unblock the Notifications