జులై 5, 2024న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG+పెట్రోల్ పవర్డ్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయడానికి బజాజ్ సిద్ధమైంది. ఈ బైక్ కు ఫ్రీడమ్ 125 అని పేరు పెట్టే అవకాశం ఉంది. కొత్త బజాజ్ మోటార్‌సైకిల్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ బైక్ అత్యంత ఇంధన సామర్థ్యం, ఆచరణాత్మకంగా ఉంటుందని కంపెనీ చెబుతోంది. కాగా 'LML ఫ్రీడమ్' అనే మోటార్ సైకిల్ చాలా సంవత్సరాల క్రితం భారతదేశంలో అమ్మకానికి ఉంది. అయితే దీనికి బజాజ్ ఫ్రీడమ్‌తో సంబంధం లేదు.
పెట్రోల్ ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రత్యామ్నాయం కోసం చూస్తున్న వాహనదారులకు సీఎన్‌జీ బైక్ విడుదల గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఈ బైక్ విడుదలకు ముందు కంపెనీ కొన్ని వివరాలను టీజ్ చేస్తూ ఓ వీడియోను చేసిన సంగతి తెలిసిందే.. ఈ బైక్ కు సంబంధించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇది రౌండ్ హెడ్‌ల్యాంప్‌తో వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో బజాజ్ విడుదల చేసిన సీటీ 110 మోడల్‌ను పోలినట్లు చెప్పుకుంటున్నారు. సీఎన్‌జీ బైక్ లో పెట్రోల్ ఆప్షన్ కూడా ఉంది. సీఎన్జీ అందుబాటులో లేన చోట పెట్రోల్ కూడా కొట్టించకోవచ్చు. ఏ ఫ్యూయల్‌తో నడపాలంటే దాంతో నడపొచ్చు. ఈ బండి ధర కూడా రూ.80 వేలు నుంచి రూ.లక్ష వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
బజాజ్ ఫ్రీడమ్ 125ని రెండు వేరియంట్‌లలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
సాధారణ మోడల్ ఒకటి ప్రీమియం మోడల్ మరొకటి లాంచ్ చేసే అవకాశం ఉంది. బజాజ్ ఆటో విడుదల చేసిన తాజా టీజర్, మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ నుంచి CNGకి మారడానికి టోగుల్ బటన్ ఉంటుందని పేర్కొంటోంది. ఇతర ఫీచర్లలో రౌండ్ LED హెడ్‌లైట్, మరింత ప్రాక్టికాలిటీని అందించే ఫ్లాట్ సీటు ఉన్నాయి. బజాజ్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే, బజాజ్ కూడా ఫ్రీడమ్ 125లో మంచి ఫీచర్లను అందించే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications