Chetak EV: కొన్ని పాత మధురాలు, గుర్తులను ఏమాత్రం మరచిపోలేము. అటువంటి వాటిలో బజాజ్ చేతక్ ఒకటి. అప్పట్లో ఈ స్కూటర్‌కి ఫ్యాన్స్ ఉండేవారు. ఇప్పటికీ దాన్ని ఇష్టపడేవారు ఉన్నారు అంటే అతిశయోక్తి కాదు. అయితే దీనిపై మార్కెట్లో ఇప్పుడు ఓ వార్త హల్ చల్ చేస్తోంది.
కొత్త ఏడాదిని గ్రాండ్ గా లాంచ్ చేసేందుకు ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటో ప్లాన్ చేసింది. గతంలో అత్యంత ఆదరణ కలిగిన చేతక్ స్కూటర్‌పై కీలక అప్డేట్ ఇచ్చింది. ఎలక్ట్రిక్ వెర్షన్ లోని ఈ స్కూటర్ ను సరికొత్త హంగులతో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. జనవరి 9న ఈ-స్కూటర్ వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపింది.

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో భారీ మార్పులు కనిపించనున్నట్లు సమాచారం. డిజైన్, రేంజ్, బ్యాటరీ వంటి పలు విభాగాలను మేకర్స్ అప్డేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 3.2 KWH బ్యాటరీ ప్యాక్ ను ఇన్‌స్టాల్ చేయనుండగా.. 130 కి.మీ రేంజ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కేవలం 4.30 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ స్కూటర్ టాప్ స్పీడ్ 73 KMPH కాగా.. TFT స్క్రీన్ వంటి పలు ఇతర ఫీచర్స్ ను సైతం బజాజ్ ఇందులో యాడ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో టర్నింగ్ నావిగేషన్, టైర్ మానిటరింగ్ సిస్టమ్, రిమోట్ లాక్, బ్లూటూత్ కనెక్టివిటీ సహా వివిధ ఆప్షన్స్ అందించనున్నారు. ఇక స్టోరేజ్ కెపాసిటీ కూడా 21 లీటర్లకు పెంచినట్లు వినికిడి.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎక్స్ షోరూం ధర 1.27 లక్షలు కాగా.. కొత్త ఫీచర్స్ యాడ్ చేయడంతో దీని రేటు మరికాస్త ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ఇప్పటికే EV మార్కెట్లో ఉన్న వివిధ ప్లేయర్స్ మధ్య పోటీని ఈ వాహనం మరింత పెంచే అవకాశం లేకపోలేదు.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications