Bajaj bikes: పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక వనరుల సద్వినియోగం పేరిట సాంప్రదాయ ఇంధన వనరుల నుంచి భారత్ వేగంగా రూట్ మార్చుకుంటోంది. పెట్రోల్, డీజిల్ స్థానంలో ఎలక్ట్రిక్, CNG, హైడ్రోజన్ గ్యాస్ వంటి ఇంధనాల వైపు మొగ్గు చూపుతోంది. అందుకు తగినట్లుగా వాహన తయారీదారులు కూడా పలు వేరియంట్లలో వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు.
ఇప్పటివరకు ఎక్కువగా కమర్షియల్ వాహనాలకు మాత్రమే పరిమితమైన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(CNG).. ఇకపై బైక్స్ కోసం కూడా వినియోగించుకోవచ్చు. ప్రముఖ టూ వీలర్ మేకర్ బజాజ్ ఈ కొత్త విప్లవానికి నాంది పలికింది. త్వరలోనే CNG ఆధారిత ద్విచక్ర వాహనాలను మార్కెట్లోకి రిలీజ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు మీడయా నివేదికలు చెబుతున్నాయి.

ఇప్పటివరకు ఏ తయారీదారు కూడా CNG ఆధారిత ద్విచక్ర వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ కు ముందుకు రాలేదు. తాజాగా బజాజ్ ఈ తరహా బైక్ రూపకల్పనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇది చివరి దశలో ఉండగా మరో 6 నెలల్లో భారత రోడ్లపై దర్శనం ఇచ్చే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఏడాదికి 2 లక్షల యూనిట్స్ తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. 110 CCతో 100 కిలోమీటర్ల అత్యధిక మైలేజ్ ఇచ్చే విధంగా బజాజ్ దీన్ని రూపొందిస్తోందట.
దేశంలోని టైర్ 1, టైర్ 2 నగరాల్లో CNG వాహనాలకు ప్రజల్లో డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే CNG చాలా చౌకగా లభిస్తుండటమే దీనికి ప్రధాన కారణం. ఇందుకుతోడు ఈ తరహా వాహనాలు మెరుగైన ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తాయి. తద్వారా వినియోగదారులతో పాటు తయారీదారులు కూడా CNG ఆధారిత వెహికల్స్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు.


Click it and Unblock the Notifications