Super Stock: ఒక్క షేర్ ఉంటే రూ.10,000 లాభం.. ఈ స్టాక్ మీ దగ్గర కూడా ఉందా..??
Bonus Shares: దేశీయంగా స్టాక్ మార్కెట్లలో పెద్ద ప్రాముఖ్యత కలిగిన ముహురత్ ట్రేడింగ్ నేడు జరగనుంది. ఈ క్రమంలో చాలా మంది ఇన్వెస్టర్లు బ్రోకరేజీలు అందిస్తున్న స్టాక్స్ లిస్ట్ పరిశీలిస్తూ తమకు అనువైన కంపెనీల షేర్లను షాపింగ్ చేసుకునే పనిలో ఉన్నారు. దీనికి తోడు ఈ క్రమంలో దేశీయ కార్పొరేట్ కంపెనీలు తమ రెండవ త్రైమాసిక ఫలితాలను ప్రకటిస్తూ తమ ఇన్వెస్టర్లకు ఉచిత బోనస్ షేర్లు, డివిడెండ్ వంటివి అందిస్తున్నాయి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్ల గురించే. నిన్న కంపెనీ షేర్లు ఇంట్రాడేలో దాదాపు 4 శాతం లాభపడి ఒక్కోటి రూ.3294.05 వద్ద ప్రయాణం ముగించాయి. తాజాగా కంపెనీ తన ఇన్వెస్టర్లకు ఒక శుభవార్త ప్రకటించింది. దీనికింద అర్హులైన ఇన్వెస్టర్లకు 3:1 బోనస్ ఇష్యూని సిఫార్సు చేసింది. ఇందుకోసం రికార్డు తేదీని నవంబర్ 12గా నిర్ణయించింది. అంటే ఎవరైనా ఇన్వెస్టర్ కంపెనీ నిర్థేశించిన రికార్డు తేదీ నాటికి తమ డీమ్యాట్ ఖాతాలో షేర్లను కలిగి ఉంటారో వారికి ప్రతి ఒక్క షేరును కలిగి ఉన్నందుకు 3 ఉచిత షేర్లను అందుకోనున్నారు. అంటే మార్కెట్ రేటు ప్రకారం బోనస్ షేర్ల వల్ల దాదాపు రూ.10 వేల వరకు బెనిఫిట్ పొందనున్నారు.

బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ కంపెనీ షేర్లు గడచిన 6 నెలల్లో పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రాబడిని అందించాయి. ఈ క్రమంలో కంపెనీ షేర్లు 153% రాబడిని పెట్టుబడిదారులకు అందించాయి. తాజాగా కంపెనీ తన ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను అందించింది. ప్రస్తుతం బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,712.91 కోట్లుగా ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కంపెనీ షేర్ల ధర ప్రకారం ఇన్వెస్టర్లు ఒక్కో షేరును కలిగి ఉన్నందుకు దాదాపు రూ.9900కు పైగా విలువైన ఉచిత షేర్లను అందుకుంటారు.
దీర్ఘకాలంలో కంపెనీ తన ఇన్వెస్టర్లకు దేశీయ బుల్ మార్కెట్లలో మంచి రాబడులను అందించింది. బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ షేర్లు ఏడాది కాలంలో దాదాపు 211% రాబడిని అందించింది. అలాగే 2024లో ఇప్పటివరకు కంపెనీ షేర్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు దాదాపు 190% వరకు రాబడిని అందుకున్నారు. ఇక దీర్ఘకాలంలో బజాజ్ స్టీల్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ స్టాక్ గత 5 ఏళ్ల కాలంలో ఇన్వెస్టర్లకు 2700% రాబడిని అందించి మతిపోగొట్టే రాబడిని అందించింది.


Click it and Unblock the Notifications