Bajaj Bikes: మార్కెట్లోకి CNG బైక్స్.. ప్రకటించిన బజాజ్.. సూపర్ మైలేజ్..
CNG Bikes: వాహనాల తయారీ రంగంలో పెను మార్పులు మెుదలయ్యాయి. క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ కింద ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతుండగా.. తాజాగా హైడ్రోజన్, సీఎన్‌జీ వాహనాలపై దేశంలోని ఆటో కంపెనీలు దృష్టి సారించాయి.
బజాజ్ ఆటో క్లీన్ ఫ్యూయల్ CNG బైకుల కొత్త పోర్ట్‌ఫోలియోను అభివృద్ధి చేస్తోంది. మొదటి CNG బైక్ జూన్‌లో మార్కెట్లోకి రానుందని బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ శుక్రవారం వెల్లడించారు. ఈ బైక్స్ సీఎన్‌జీ గ్యాస్‌తో నడుస్తాయి. జూన్‌లో ఇది రోడ్లపైకి వస్తోంది. దీని వల్ల వాహనదారులు తమ ప్రయాణంలో పెట్రోల్ కోసం ఎక్కువ చెల్లించడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాబోయే 5 ఏళ్లలో ఈ టెక్నాలజీపై రూ.5,000 కోట్లను వెచ్చించనున్నట్లు బజాజ్ గ్రూప్ ప్రకటించింది.

తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ అందించే టూవీలర్స్ కావాలనుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని బజాజ్ గ్రూప్ ఈ సరికొత్త ఉత్పత్తిని తీర్చిదిద్దింది. ఇది విజయవంతంగా లాంచ్ అయితే భారతీయ రోడ్లపైకి వచ్చిన మొదటి CNG బైక్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న పెట్రోల్ వాహనాల కంటే వీటి ధర అధికంగా ఉండొచ్చని ఆటో రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దేశంలోని రెండు కోట్ల మంది యువతకు రానున్న కాలంలో కంపెనీ టార్గెట్ చేసి తన ఉత్పత్తులను విడుదల చేస్తోంది.
20 ఏళ్ల క్రితం లాంచ్ చేసిన పల్సర్ త్వరలో 2 మిలియన్ యూనిట్లకు చేరుకుంటుందని బజాజ్ తెలిపింది. బజాజ్ గ్రూప్ తన అన్ని CSR, దాతృత్వ కార్యక్రమాల కోసం గ్రూప్ యొక్క కొత్త ఫ్లాగ్‌షిప్ 'బజాజ్ బియాండ్' కింద కెపాసిటీ బిల్డింగ్‌పై దృష్టి సారిస్తోంది. రానున్న 5 ఏళ్లలో సామాజిక ప్రభావ కార్యక్రమాలకు రూ.5,000 కోట్లు కేటాయించింది.
అలాగే గడచిన పదేళ్ల కాలంలో ఏకంగా రూ.4,000 కోట్లను విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, నీరు వంటి సామాజిక కార్యక్రమాలకు వెచ్చించినట్లు బజాజ్ ఆటో ఛైర్మన్ నిరాజ్ బజాజ్ తెలిపారు. జమ్నాలాల్ బజాజ్ ఫౌండేషన్, జాంకితేవి బజాజ్ గ్రామ వికాస్ సంస్థ, కమల్ నయన్ బజాజ్ హాస్పిటల్ వంటి బజాజ్ గ్రూప్ దేశంలో సేవలను అందిస్తున్నాయి. బజాజ్ గ్రూప్ కంపెనీల్లో బజాజ్ ఆటో, బజాజ్ ఫిన్‌సర్వ్, బజాజ్ ఎలక్ట్రికల్స్, ముకంద్ లిమిటెడ్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications