బజాజ్ ఫైనాన్స్ అనుబంధ సంస్థ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్(Bajaj Housing Finance) ఐపీఓగా రానుంది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ కోసం కంపెనీ విలువను రూ. 56,000 కోట్ల నుంచి రూ. 59,000 కోట్ల మధ్య లెక్కగట్టాలని భావిస్తోంది. ఐపీఓ ద్వారా దాదాపు రూ.7 వేల కోట్ల సేకరించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అనేక సంవత్సరాల తర్వాత బజాజ్ గ్రూప్ నుంచి ఐపీఓ రానుంది. ఈ ఐపీఓను సెప్టెంబర్ మొదటి అర్ధభాగంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. జూన్‌లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ ద్వారా రూ. 7,000 కోట్లు సేకరించడానికి SEBIకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసింది. ఇందులో రూ. 4,000 కోట్ల విలువైన కొత్త షేర్లు, రూ. 3,000 కోట్ల ఆఫర్‌ను అమ్మకానికి పెట్టారు. మార్కెట్ రెగ్యులేటర్ ఈ నెల ప్రారంభంలో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓకి అనుమతి ఇచ్చింది.
ఇష్యూ పరిమాణం రూ. 6,300 కోట్ల నుంచి రూ. 6,600 కోట్లకు ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆగస్టు 14న రోజు ట్రేడ్ ముగిసే సమయానికి, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్ మార్కెట్ క్యాప్ వరుసగా రూ. 4 లక్షల కోట్లు, రూ. 2.46 లక్షల కోట్లుగా ఉంది. కోటక్ మహీంద్రా క్యాపిటల్, బోఫా సెక్యూరిటీస్, యాక్సిస్ క్యాపిటల్, జెఎమ్ ఫైనాన్షియల్ లిమిటెడ్, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్, గోల్డ్‌మన్ సాక్స్, ఎస్‌బిఐ క్యాపిటల్ మార్కెట్‌లు బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్‌లుగా ఉన్నాయి. సిరిల్ అమర్‌చంద్ మంగళదాస్ హౌసింగ్ ఫైనాన్షియర్‌కు న్యాయ సలహాదారుగా ఉన్నారు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం నోటిఫై చ్సిన ఎన్బీఎఫ్సీలు మూడు సంవత్సరాలలో స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కావాలి. అంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబర్ 2025 లోపు లిస్ట్ చేయాలి. సెప్టెంబర్ 30, 2022న, NBFCల కోసం స్కేల్ బేస్డ్ రెగ్యులేషన్ కింద 16 NBFCల జాబితాను RBI ప్రకటించింది. ఫ్రేమ్‌వర్క్ NBFCలను బేస్ లేయర్ (NBFC-BL), మిడిల్ లేయర్ (NBFC-ML), అప్పర్ లేయర్ (NBFC-UL), టాప్ లేయర్ (NBFC-TL)లో వర్గీకరించింది. టాప్ లేయర్ లో బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్‌తో పాటు, జాబితాలో టాటా సన్స్, హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, షాంఘ్వీ ఫైనాన్స్ ఉన్నాయి. హెచ్‌డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా ఐపీఓగా తీసుకొచ్చే అవకాశం ఉంది.
బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ దేశవ్యాప్తంగా 76.5 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులకు అందించే విభిన్నమైన NBFC గా ఉంది. పూణేలో ఉన్న ఇది గృహాలు లేదా వాణిజ్య స్థలాల కొనుగోలు, పునరుద్ధరణ కోసం వ్యక్తులతో పాటు కార్పొరేట్ సంస్థలకు అప్పులు ఇస్తోంది. మార్చి 31, 2024తో ముగిసిన సంవత్సరానికి, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ నిర్వహణలో రూ.91,370 కోట్ల ఆస్తులను కలిగి ఉంది. భవిష్యత్ వ్యాపార అవసరాలను తీర్చడానికి ఇది తన మూలధన స్థావరాన్ని పెంచుకోవడానికి తాజా ఇష్యూ నుంచి వచ్చే నిధులను వినియోగించనుంది. మేలో ఫిలిప్‌క్యాపిటల్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ సెప్టెంబరు 2025లో ఎక్స్ఛేంజీలలో ఒక షేరుకు రూ. 550-570 లిస్టింగ్ ధరతో ప్రారంభమవుతుందని అంచనా వేసింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications